గ్రేట్‌ఆంధ్ర.కాం బాటలో చాలా వెబ్‌సైట్లు

అందరినీ ఆకట్టుకునేవి గాసిప్స్/రూమర్స్. మనకు ఇష్టమైన వాళ్ళపై వచ్చే రూమర్స్ నిజం కాదు అని ignore చేస్తూ, ఇష్టం లేని వాళ్ళపై వచ్చే రూమర్స్ నిజం అన్నట్టుగా ప్రచారం చెయ్యడం మనలో వుండే సహజమైన శాడిజం. వాటి క్రేజ్ ను ఎవరూ కిల్ చెయ్యలేరు.

మనం ఒక వెబ్ సైటు నడుపుతున్నప్పుడు, జనాలు మనపై ఉమ్మేసినా ‘ఉమ్మేసే జానాలు ఏమైనా ప్రతివ్రతాలా’ అని అనుకుంటూ ఈజీగా తుడుచేసుకునే రకంగా మన మైండ్ ను ట్యూన్ చేసుకోవాలి. end of the day, ఒక వెబ్ సైటుకు కావలసింది హిట్స్ అనుకునే చాలా వెబ్ సైట్స్ నడుపుతుంటారు. ఇది తప్పా, ఒప్పా అనేది చూసే కోణం బట్టి వుంటుంది కాబట్టి ఎవరి ఇష్టం వారిది అని అనుకోని వదిలేయడం తప్ప దానిపై వాదించడం వృధా.

గ్రేట్‌ఆంధ్ర.కాం వెబ్‌సైటు అనే కాదు, ఏ సైటు న్యూస్ చూసినా తమకు అనుకూలంగా అల్లే కల్పిత కథలే. మన సమాజం వివిధ వర్గాలుగా విడిపోయిందనుకుంటే, ఈ వెబ్‌సైటులో వచ్చే కథనాలు ఏ వర్గానికి వ్యతిరేకంగా వ్రాసాయో ఆ వర్గం తప్ప అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.

తమకు నచ్చని వర్గంపై వచ్చే న్యూస్‌ను ఎంజాయ్ చేస్తూ, తమ నచ్చే వర్గంపై వచ్చే న్యూస్లు మాత్రం కరెక్ట్ కాదు అనేవాళ్ళను చాలామందిని చూసాను. ఎందుకు వచ్చిన గొడవ, మన వాళ్ల మీద ఎక్కడ పడతాడో అనే భయంతో అన్నీ కల్పిత కథలను ఖండించే వాళ్ళను కూడా చూసాను. మేము ఏ వర్గం కాదు అనుకుంటూ, అన్నీ న్యూస్‌లను ఎంజాయ్ చేసేవాళ్ళనూ చూసాను.

ఇప్పుడు అదే బాటలో చాలా వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి, పుట్టు కొస్తున్నాయి.వారు చేసేది తప్పు అనను. ఏది నిజం, ఏది కల్పితం అనేది తెలుసుకొవల్సిన బాద్యత చదివే వాళ్ళదే.

పవన్‌కల్యాణ్ స్వీయా దర్శకత్వంలో మొదలయ్యిన ‘సత్యాగ్రహి’ కాప్షన్ ‘సత్యమే నా ఆయుధం’.

మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఇప్పుడు నా బ్లాగును ‘సత్యమే నా ఆయుధం’ అన్నట్టుగా వ్రాస్తున్నాను. నా బ్లాగు అంటే నా ఇష్టాలే వుంటాయి. నా ఇష్టాలతో పాటు మరికొందరి ఇష్టాలను కలుపుకొని సత్యం అనే ఆయుధంతో ఒక వెబ్‌సైటును కూడా బిల్డ్ చెయ్యాలనుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.