టాకీ పూర్తి కానున్న పరమ వీర చక్ర

నందమూరి అభిమానులు కూడా లైట్ తీసుకున్న సినిమా పరమ వీర చక్ర. దానికి కారణం ఆ సినిమాకు దర్శకుడు దాసరి నారాయణరావు కావడమే అనవచ్చు. ఈ సినిమా మాస్ ను అలరిస్తుందన్న ఆశ మాత్రం వుండి వుండవచ్చు. ఆ ఆశతోనే బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్ ను ఒప్పుకొని వుండవచ్చు. షూటింగ్ ఫినిషింగ్ దశలో వున్నప్పుడు ఆ విషయాలు అనవసరం.

అసోసియేట్ డైరక్టర్ ఫ్రెండ్ ఈ సినిమా మొదలయిన సమయంలో ఇంకో సినిమాకు కమిట్ అవ్వడం వలన ఈ సినిమాకు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే అవకాశం కోల్పోయాడు. కమిట్ అయిన సినిమా అయిపోయిన తర్వాత సినిమాలు ఏమీ చెయ్యకుండా కళ్యాణ్ రామ్ కోసం కథ తయారు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అదృష్టం కలిసొచ్చి ‘పరమ వీర చక్ర’ పోస్ట్ ప్రొడక్షన్ లో పనిచేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. కళ్యాణ్ రామ్ కు కథ వినిపించేటప్పుడు ఈ నందమూరి అనుభవాన్ని హైలట్ చేసుకోవచ్చు.

అతని న్యూస్ ప్రకారం డిసెంబర్ 2 తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పెండింగ్ సాంగ్స్ డిసెంబర్ లోనే ఫినిష్ చేస్తారు.సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలన్న పట్టుదలతో వున్నారు. అందుకనే పెరలల్ గా రెండు మూడు రోజుల్లో డబ్బింగ్ స్టార్ట్ చేస్తున్నారు. నేనింతే సినిమాలో వినాయక్ నటించినట్టు, ఆరుగురు ప్రముఖ దర్శకులు ఈ సినిమాలో నటించండం ఈ సినిమా ప్రత్యేకత.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.