అందమైన ప్రేమకథ ‘ఆరెంజ్’

బొమ్మరిల్లు భాస్కర్ ఆరెంజ్ గురుంచి సాక్షి దిన పత్రికలో చెప్పిన విశేషాలు:

నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకున్న కథ ఇది.

ప్రేమ మీద ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అలాగే నాక్కూడా ఒక అభిప్రాయం ఉంది. ఒక విజన్ ఉంది. అదే ఈ సినిమాలో చూపించాను.

‘మగధీర’ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఈ కథ సిద్ధం చేశాను. చరణ్ సింగిల్ సిట్టింగ్‌లో కథను ఓకే చేశారు.

‘ఈ కథలో కరెక్షన్స్ అంటూ ఏమీ లేవు.. నిర్భయంగా ప్రొసీడ్ అయిపోవచ్చు..’ అని ప్రోత్సహించారు నాగబాబు.

‘మగధీర’కు ఏ మాత్రం పోలికలేని విధంగా, పూర్తి కాంట్రాస్ట్‌తో ఈ సినిమా ఉంటుంది.

అమ్మాయిలందరూ తమకు తాము ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో జెనీలియా పాత్ర ఉంటుంది. ‘బొమ్మరిల్లు’ ఆమెకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో అంతకు మించిన పేరును ఇందులోని పాత్ర జెనీలియాకు తెచ్చిపెడుతుంది.

యూత్‌ని ఓ కొత్తలోకంలో తీసుకెళ్లే అందమైన ప్రేమకథ ‘ఆరెంజ్’.

చరణ్ కెరీర్‌లో ఇది నిలిచిపోయే సినిమా అవుతుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in వేరే వాళ్ళ అభిప్రాయం, సినిమా, Xclusive. Bookmark the permalink.