ఈసారి టార్గెట్ భారీ కలక్షన్స్ కాదు

క్లాస్ అంటే ఏమిటి ? మాస్ అంటే ఏమిటి ? అని విపులంగా చెప్పడం కష్టం. ఒక్కొకరు ఒకో విధంగా నిర్వచిస్తారు. కొందరు అసలు మాస్ లేదు, క్లాస్ లేదు అంటారు. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా నేను నాకు తోచిన విధంగా ఉపయోగించే మాస్ , క్లాస్ వర్డ్స్ ను పెద్ద పట్టించు కోకుండా ఫ్లో లో చదివేయండి.

చిరంజీవి ఇంద్ర సినిమా వచ్చేదాకా చిరంజీవి అభిమానులు గిల గిల కొట్టేసుకున్నారు. ఇంద్ర సినిమా రికార్డులు తిరగ వ్రాసాక కొద్దిగా శాంతించారు.

పోకిరి రికార్డులు పవన్ కళ్యాణ్ తిరగ వ్రాస్తాడని ఆశిస్తే, సరప్రైజింగ్ గా చరణ్ ఎంట్రీ అవ్వడం, మగధీరతో ఇప్పట్లో ఎవరికీ అందనంత రికార్డ్స్ సెట్ చేయడం జరిగిపోయింది.

ఆరెంజ్ విషయంలో ఆనందించ తగిన విషయం ఏమిటంటే, అభిమానులకు ఈ సినిమా కలక్షన్స్ వండర్స్ చేస్తుందని అంచనాలు లేకపోవడం.

కొందరు అభిమానులు ఫ్లాఫ్ కాకుంటే చాలు అని చెప్పినా, చరణ్ నుంచి ఎక్సట్రర్డనరీ ఫెరఫార్మన్స్ ఎక్సపెట్ చేస్తున్నారు. ట్రైలర్స్ లో పాటలు ఎలా వుంటాయో చెప్పారు కాని, చరణ్ ఏ రకమైన ఫెరఫార్మన్స్ చేస్తున్నాడన్నది మాత్రం గోప్యంగానే వుంచారు.

నాకు అందిన సమాచారం ప్రకారం సినిమా పూర్తి క్లాస్. ఫైట్స్ కూడా బాగానే వచ్చాయి. డాన్స్ పర్వాలేదు. పర్వాలేదు అంటే ఎక్సట్రర్డనరీ కాదు అని. స్కై డైవ్ హిరో ఇంట్రడక్షన్ కాదు, క్లైమాక్స్ కు ముందు వస్తుంది. చరణ్ ఫెరఫార్మన్స్ గురుంచి ఎటువంటి సమాచారం లేదు. సినిమా ప్రేక్షకులకు నచ్చేతే ఖుషీ టాక్ ఎక్సపేట్ చేయవచ్చు. ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా మగధీర రికార్డ్స్ బద్దలు కొట్టే సినిమా కాదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.