బొమ్మరిల్లు కంటే తక్కువ, పరుగు కంటే ఎక్కువ !

పరుగు కంటే బాగుంటుంది, కాని బొమ్మరిల్లంత వుండదు అని ఎక్కడో నెట్‌లో చదివినట్టు గుర్తు. ఈ inside info ని నా అల్‌టైం ఫేవరెట్ మూవీస్‌లో ఒకటైన గ్యాంగ్‌లీడర్ సినిమాలోని డైలాగ్‌కు అన్వయించి బొమ్మరిల్లు, పరుగు సినిమాలపై నా అభిప్రాయలను వ్యక్తపరుద్దాం అని ఈ పోస్ట్.

బొమ్మరిల్లు: హిరోకు తగిన ప్రాదాన్యం వున్నా, హిరోయిన్‌కు కూడా అంతే ప్రాదాన్యం వుంటుంది. ఇటువంటి సినిమాలు తెలుగులో ఒక ఇమేజ్ వున్న హిరోలు చేయడానికి సంశయిస్తారు. మంచి ఫీల్, మంచి పాటలు వున్న సినిమా. క్లాస్‌కు మాత్రమే కాదు, మాస్‌కు కూడా నచ్చిన క్లాస్ సినిమా అని నా అభిప్రాయం. చాలా చాలా రేర్‌గా ఇటువంటి సినిమాలు వస్తాయి.

పరుగు: లేచిపొవడం అనే కాన్సప్ట్ మీద తీసిన సినిమా. మొత్తం సినిమా అంతా ఆ కాన్సప్ట్ మీదే నడుస్తుంది. నాకు అసలు నచ్చలేదు. కొన్ని కొన్ని సీన్స్ కథలొ అసలు కలవలేదు. పొద్దునే అందరూ కాలకృత్యాలు తీర్చుకునే టైంలో హిరోయిన్ బయటకు రావడం, హిరోకు తారస పడటం లాంటి సీన్ ఇటువంటి సినిమాకు అసలు అతకదు. కాలకృత్యాలను అంతలా హైలట్ ఎందుకు చేసారో ? ఫర్ మి వర్స్ట్ మూవీ. కాన్సప్ట్ నచ్చలేదు, కథనం అసలు నచ్చలేదు. ఈ సినిమాలో ఏమైనా నచ్చింది ఒకటి చెప్పమంటే, క్లైమాక్స్ లో ప్రకాష్‌రాజ్ అల్లు అర్జున్ వచ్చినప్పటి నుంచి అతను పడే తడబాట్లు అని చెపుతాను.

ఆరెంజ్: బొమ్మరిల్లు కంటే తక్కువ, పరుగు కంటే ఎక్కువ. దీనిని ఎలా అర్దం చేసుకొవాలో అర్దం కావడం లేదు. బొమ్మరిల్లు అంత జనాదారణ పొందితే జాక్‌పాట్. పరుగు లాంటి కాన్సప్ట్ అయితే టూ వర్స్ట్. మూవీ రేంజ్ ఏది అయినా భాస్కర్ ప్రయత్నంలో నిజాయితీ వుంటుందని మాత్రం గ్యారంటీ వుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.