మగధీర తర్వాత ..

హిరోలతో సమానంగా డైరక్టర్స్ పోటి పడుతున్నారు. ప్రేక్షకులు ఇదివరకు సినిమా అంటే హిరోది అని మాత్రమే అనుకునేవారు. కాని ఇప్పుడు డైరక్టర్‌కు కూడా ప్రేక్షకులలో బాగా వెయిటేజ్ పెరిగింది. హిరో మీద ఎంత ఒత్తిడి వుంటుందో డైరక్టర్ మీద కూడా అంతే ఒత్తిడి వుంటుంది.

ఇక మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అంటే ఆ హిరో, డైరక్టర్లపై ఎంత ఒత్తిడి వుంటుందొ చూసుకొండి..

మగధీర తర్వాత రాజమౌళి మర్యాద రామన్న సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు రామ్‌చరణ్ ఆరెంజ్ సినిమాతో వస్తున్నాడు.

మెగాస్టార్ వారసుడిగా మొదటి సినిమా నుంచే ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న రామ్‌చరణ్ కు ఈ ఒత్తిడి కొత్త కాదు. దీనికి తోడు మెగా అభిమానులు కూడా ప్రతి సినిమా మగధీర సినిమా కాలేవు అనే నిజాన్ని తెలుసుకొని ఆరెంజ్ సినిమాలో రామ్‌చరణ్ తన జాబ్ తాను చేస్తే చాలు, ఈ సినిమా ద్వారా రికార్డ్స్ మాకు అక్కర్లేదు అని అనడం రామ్‌చరణ్ కు రిలీఫ్.

ఎంతొ కష్టపడి చేసిన సినిమా ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో అనే సహజమైన ఒత్తిడి తప్ప, వేరే ఒత్తిళ్ళు లేవు.

‘గుడుంబా శంకర్’, ‘బుజ్జిగాడు’, ‘ఆర్య2’, ‘ఖలేజా’ సినిమాల మాదిరి కొంతమందికి నచ్చినా ఈ సినిమా టార్గెట్ రీచ్ అయినట్టే. అలా కాకుండా అందరికి నచ్చితే రామ్‌చరణ్ జాక్‌పాట్ కొట్టినట్టే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.