కొత్తదనం C/O ఆరెంజ్

ఆరెంజ్ సినిమాతో ఒక కొత్త పాయింట్‌ను భాస్కర్ తెలుగు ప్రేక్షకులకు అందించాడు అంటే కారణం భాస్కర్‌కు రామ్‌చరణ్ అందించిన సహకారం. ఈ సినిమాను నాగేంద్రబాబు ఇష్టపడి చేసాడని నేననుకొను. చాలా మంది తెలుగు నిర్మాతలకు పెద్ద హిరో ఏది చెపితే అదే చేస్తారు, తమకంటూ ఇటువంటి సినిమా తీయ్యాలని వుండదు. వున్నాపెద్ద హిరో కోసం కాంప్రమైజ్ అయిపొతారు. ఆరెంజ్ సినిమా కూడా ఆ కోవలొకే వస్తుంది. చరణ్ ప్రొద్బలంతో నాగేంద్రబాబు నిర్మించిన సినిమా తప్ప, ఇష్టపడి చేసిన సినిమా కాదు.

మూవీ అంటే ఎమోషనల్ జర్నీ. దానికి వ్యతిరేకంగా అసలు ఏ సమయంలోనూ ప్రేక్షకుడికి ఎమోషన్స్ అనేవి కలగకుండా మొదటి నుంచి చివరి దాకా సాగడమే ఈ సినిమా ఆరెంజ్ ప్రత్యేకత. కొత్తదనం C/O ఆరెంజ్.

సినిమా ఖర్చు, సినిమా లాభనష్టాలు పక్కన పెడితే, భాస్కర్‌ ఈ సినిమా కొత్తగా చూపించడానికి చాలా సిన్సియర్‌గా ప్రయత్నం చేసాడని చెప్పవచ్చు. తెలుగు సినిమాలలో కొత్తదనం వుండటం లేదు అనేవాళ్ళు కచ్చితంగా మెచ్చుకొవలసిన సినిమా.

మాస్ ప్రేక్షకులకు అర్దం అయ్యేలా కథ చెప్పడంలో భాస్కర్ ఫెయిల్ అయ్యాడు, ఎంత మందికి అర్దం అయ్యింది, ఎంత మందికి అర్దం కాదు, కమర్షియల్‌గా హిట్ కాదు అనే మాటలు పక్కన పెడితే, ప్రేమికులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు తమని తాము ప్రశ్నించుకునే పాయింట్ ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం జరిగింది.

పొరబాటున ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ అయితే క్రెడిట్ అంతా నిజాయితీగా పని చేసిన భాస్కర్ మరియు భాస్కర్ ను సపోర్ట్ చేసిన రామ్‌చరణ్ లదే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.