అబద్దం అనే నిజం ఆరెంజ్

ఒకరు నా వ్యూ ఇక్కడ చూసి ఆరెంజ్ సినిమాకు “అబద్దం” అని టైటిల్ పెట్టి, “ఇది ఒక నిజం” ఉపశీర్షిక పెట్టుంటే బాగుండేది అన్నారు.

అబద్దం అనే నిజం ఎంత మందికి తెలుసు ?

ఈ స్టేట్‌‍మెంట్ ఎంత కన్‌ఫ్యూజన్‌గా వుంది. మీరు కూడా అబద్దాన్ని, నిజాన్ని రిలేట్ చేస్తూ ఒక స్టేట్‌‍మెంట్ ప్రయత్నం చెయ్యండి. అంతే కన్‌ఫ్యూజన్‌గా వుంటుంది.

ఏది నిజం ? అని తెలుసుకొవడానికి ఎంతో మంది జీవితాంతం ప్రయత్నం చేస్తూనే వుంటారు. నిజం అంటే ఏమిటో తెలుసుకున్న కొంతమంది “ఇది నిజం” అని చెప్పే ప్రయత్నం చేసినా ఎవరికి అర్దం కాదు. ఎందుకంటే నిజం ఎవరికి వారు తెలుసుకొవల్సిందే తప్ప ఇంకొకరు చెపితే ఒప్పుకునేది కాదు. అటువంటి “నిజం” ను కేంద్రంగా నిజాయితీగా సినిమా తీస్తే కన్‌ఫ్యూజన్ లేకుండా ఎలా వుంటుంది ?

కొత్తదనం C/O ఆరెంజ్ అని ఎందుకన్నాను అంటే, ఎవరికి అర్దం కాని “నిజం” గురించి చెప్పే ప్రయత్నం ఆరెంజ్ సినిమా ద్వారా భాస్కర్ చేసాడు. ఆరెంజ్ అని ఎందుకు టైటిల్ పెట్టాడో నాకు తెలియలేదు, కాని నిజానికి ఈ సినిమాకు టైటిల్ “అబద్దం” అని పెట్టుంటే బాగుండేది.

తొలిప్రేమ లాంటి ఫీల్ ఎక్సపెట్ చేసాను. సినిమాలో అసలు ఫీలే లేదు. YES, ఒక్క సీనులో కూడా ఈ ఎమోషన్ పండిద్దాం అని ట్రై చేయలేదు, ప్రతి సీను ద్వారా “నిజం” చెప్పే ప్రయత్నం చేసాడు.

తమ్ముడు లాంటి యాక్షన్ చరణ్ నుంచి ఎక్సపెట్ చేసాను. అసలు ఆ ఛాయలే లేవు. సిన్సియర్ గా సిరియస్ తాను నమ్మిన నిజాన్ని నిజం అని ప్రూవ్ చేయడానికే ప్రయత్నం చేసాడు. ప్రతి సీను రామ్‌చరణ్ చాలా కాన్ఫిడెంట్‍‌గా చేయడం మాత్రం కనిపించింది.

కథ ఇలా చెపితే హిట్ అవుతుంది అని తెలిస్తే అందరూ అలానే చేస్తారు. అన్నీ హిట్ సినిమాలే. అటువంటి సినిమాలకు రోటిన్ అనే మాట తప్పదు. రోటిన్‌కు భిన్నంగా ప్రయత్నం చేసిన సినిమా ఆరెంజ్. కాబట్టి కన్‌ఫ్యూజన్, అర్దం కాలేదు, కమర్షియల్ ఫ్లాఫ్ అనే మాటలు సహజం.

సినిమాలో అసలు కమర్షియల్ విలువలు లేవు అనుకుంటే పొరబాటు. యూత్ .. యూత్ .. వారికి కావలసిన ఎలిమెంట్స్ అన్నీ వున్నాయి. యూత్‌ను ఆకట్టుకొవడానికి కూడా “నిజమే” ఎంచుకొవడం ఈ సినిమా ప్రత్యేకతగా చెప్పుకొవచ్చు.

ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ కోసం కూడా అంతే కష్టపడితే, ఫ్లాప్ టాక్‌తో మొదలైన ఈ సినిమా హిట్ అవ్వడానికి ఛాన్స్ లేకపొలేదన్నది నిజం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.