ఆరెంజ్ = ప్రేమ + నిజం

నా వయసు 29+. నేను అధ్యాత్మికంగా ఎక్కువ ఆలోచిస్తాను. నేను ఆరెంజ్ సినిమా మొత్తం క్రియేటర్ ఎంచుకున్న రెండు కోణాలలో “నిజం” అనే కోణం లోంచే సినిమా చూసాను. ఈ సినిమాకు మరొక కోణం “ప్రేమ”.

ప్రతి సీనులోను నాకు నిజమే కనిపించింది. దర్శకుడి సిన్సియర్టీ నచ్చింది. దర్శకుడు ఒత్తిడి లేకుండా చేయడానికి కారణం రామ్‌చరణ్ సపొర్టే కాబట్టి, ఇంత హెవీ సబ్జక్ట్ మూడో సినిమాకే ఎంచుకొవడం రాంగ్ డెసిషన్ అనిపించినా, రామ్‌‍చరణ్‌లో కాన్ఫిడెన్స్ నచ్చింది.

ఈ సినిమాకు మరొక కోణం “ప్రేమ”. ఆ కొణంలో చూసిన చాలా మందిని అడిగాను. అందరూ బాగానే వుంది అన్నారు తప్ప, బాగోలేదు అని ఎవరూ అనలేదు. ప్రేమించే ప్రతి యువకుడు రామ్‌చరణ్ లా నిజంగా ప్రేమించాలనుకుంటాడు. ప్రేమించి ప్రతి యువతి రామ్‌చరణ్ లా ప్రేమించే ప్రేమికుడు కావాలనుకుంటుందనేది నిజం.

మా అన్నయ్య వయసు 39+. ఏమీ అర్దం కాలేదురా అన్నాడు. ఈ కోణంలో భాస్కర్ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యాడు అనేకంటే ఈ స్టేట్‌మెంట్ కరెక్ట్ గా సరిపొతుంది:

ఏది నిజం ? అని తెలుసుకొవడానికి ఎంతో మంది జీవితాంతం ప్రయత్నం చేస్తూనే వుంటారు. నిజం అంటే ఏమిటో తెలుసుకున్న కొంతమంది “ఇది నిజం” అని చెప్పే ప్రయత్నం చేసినా ఎవరికి అర్దం కాదు. ఎందుకంటే నిజం ఎవరికి వారు తెలుసుకొవల్సిందే తప్ప ఇంకొకరు చెపితే ఒప్పుకునేది కాదు. అటువంటి “నిజం” ను కేంద్రంగా చేసుకొని నిజాయితీగా సినిమా తీస్తే కన్‌ఫ్యూజన్ లేకుండా ఎలా వుంటుంది ? All negative reviews are acceptable. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ కోసం కూడా అంతే కష్టపడితే, ఫ్లాప్ టాక్‌తో మొదలైన ఈ సినిమా హిట్ అవ్వడానికి ఛాన్స్ లేకపొలేదన్నది నిజం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.