జగన్ .. చంద్రబాబు .. కె.సి.ఆర్ .. చిరంజీవి ..

నాకు జగన్‌ అంటే ఒక విషయంలోనే చిరాకు. అది చిరంజీవికి వ్యతిరేకంగా వ్రాసేటప్పుడు, వెటకారం చేసినప్పుడు.

నా దృష్టిలో రాజకీయాలంటే దోచుకొవడానికి రాజమార్గం. వ్యాపారంలో మోసం చేయడం ఎలా తప్పు కాదో, రాజకీయలలో దోచుకొవడం కూడా తప్పు కాదు అని నమ్ముతాను. ఎవరి స్థాయికి వారు దోచుకుంటారు. జగన్ స్థాయి అందరికంటే ఎక్కువో, అందరి దృష్టి అతనిపైనే వుండటం వలనో ఇరగ దోచేసుకున్నాడు అనే ఫీలింగ్ వుంది. అతను దోచుకొవడమే కాదు, తనని నమ్మిన వాళ్ళకు కూడా దోచిపెట్టాడు అనే మంచి పేరు కూడా వుంది.

వై.యస్.ఆర్ కు వున్న పెద్ద నెగటివ్ ఏమిటంటే, ఎదిరించే ప్రత్యర్ది వర్గానికి దోచుకొవడానికి దారులు అన్నీ మూసేస్తాడు. ఆ విధంగా రామోజీ లాంటోళ్ళు వై.యస్.ఆర్ ఫ్యామిలిపై ఫాక్షనిష్టులు కన్నా పగ పెంచేసుకున్నారు.

చిరంజీవి తన సంపాదన అంతా కష్టపడి సంపాదించుకున్నానని ఫీల్ అవుతూ వుంటాడు. నేను కూడా అదే ఫీల్ అవుతూ వుంటాను. వై.యస్.ఆర్ వర్గం మాత్రం పేదవాళ్ళు కష్టపడి పని చేసుకున్న డబ్బులతో చిరంజీవి సినిమాలు చూస్తేనే చిరంజీవి ఆ స్థాయికి చేరుకున్నాడని వాదిస్తారు.

ఏదైనా అదే పనిగా చిరంజీవిపై బురద జల్లించడం, తమ పేపరు ఛానల్‌ల్లో బురద చల్లడం తప్పు అని నా ఫీలింగ్. ఆ విధంగా జగన్ అంటే చిరాకేత్తింది. చిరంజీవి వచ్చి ఎదో సాధిస్తాడని నమ్మకమైతే లేదు కాని, చిరంజీవిని రాజకీయంగా ఉన్నత స్థానంలొ చూడలనివుంది.

అన్నగారు వోట్లడిగే పద్ధతెంత పసందుగా ఉంటుందో గమనించారా? ‘తెలుగుదేశం పిలుస్తోంది రా’ అంటూ ఒక చెయ్యి నడుమ్మీదేసుకుని రెండో చెయ్యి ముందుకు చాచి ఎంత ధీమాగా ఆజ్ఞాపిస్తారో! అదేదో, మనందరమూ చచ్చినట్లు వెళ్లి తెలుగుదేశానికే వోట్లేసి తరించాలన్న హుకుంలా ఉంటుందే కానీ మిగతా పార్టీల్లా వోట్లు అడుక్కుంటున్నట్లుండదు. ఆయనకే సాధ్యమైన స్టైల్ అది.

రాజకీయలలో ప్రజలకు, కార్యకర్తలకు లొంగి వుంటూనే వారిపై అధికారంతో కూడిన పట్టు సాధించాలి. ఎక్కడో చదివాను(link is provided above) స్వర్గీయ ఎన్.టి.ఆర్ “తెలుగుదేశం పిలోస్తుంది .. రా .. కదలిరా” అంటుంటే అదే ఫీలింగ్ వుంటుందని. ఎన్.టి.ఆర్ లాంటి తెగింపు చిరంజీవిలో లేదు. అందరూ కావాలనుకునే నాన్చుడే దానికి కారణం. ప్రజాభివృద్దికి సమస్యలు సృష్టించే వాడెవడైనా శత్రువే. సమస్యలే మా శత్రువులు అని మొదలైన చిరంజీవి రాజకీయ ప్రయాణంలో స్పష్టత లేక ఆదిలోనే గండి పడింది. ప్రజలు రమ్మంటే వచ్చిన మాట వాస్తవమే అయిన, ఆ మాట చిరంజీవే పదికి వందసార్లు చెప్పడం వలన కామెడీ అయిపొయింది.

చక్రం బాబు అని పేరు తెచ్చుకున్న చంద్రబాబు చిరంజీవి రాజకీయ ప్రవేశంతో కె.సి.ఆర్‌తో చేతులు కలిపి మశానం అయిపొయాడు. చంద్రబాబుకు మూడు ఆయుధాలు 1)స్వర్గీయ ఎన్.టి.ఆర్ సృష్టించిన సైకిల్ గుర్తు 2)ఈనాడు 3) కాంగ్రెస్‌కు ప్రత్యన్నమయం.

కె.సి.ఆర్ .. కుల రాజకీయలను బ్రేక్ చేస్తూ “ప్రాంతం” అనే ఆయుధంతో రాజకీయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయనే నెం 1 రాజకీయ నాయకుడు.

జగన్ .. చంద్రబాబు .. కె.సి.ఆర్ .. చిరంజీవి .. ఎవరి ఆయుధాలు ఏవైనా మన రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగవ్వాలన్నదే నా కొరిక. ఎవరైనా దోచుకొనుడే.

“ఆడు కాకపొతే వీడు .. వీడు కాకపొతే ఆడు .. ” అని కాకుండా అందరికీ దోచుకునే అవకాశం రావాలి .. నాలుగైదు ప్రాంతీయ పార్టీల ద్వారా అది సాధ్యమే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.