భారం లేదు .. బొంగు లేదు .. మళ్లీ ఎన్నికలు జరగాలి

పార్లమెంటరీ రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టాయో తాజా రాష్ట్ర పరిణామాలు ఋజువు చేస్తున్నాయి. ప్రజలు ఓట్లు వేసాక ఇంక తమ చేతిలో ఏ అధికారమూ లేక దొంగలు దొంగలు దోచినది పంచుకుంటుంటే చూస్తూ మరో టర్మ్ వచ్చేదాక వేచి చూసి మరల మరో కొత్త దొంగల ముఠాను ఎన్నుకోవడానికి తయారు కావడమే తప్ప మరో మార్గం లేని నిస్సహాయత.

ఎంత దోచుకున్నా మాకు ఇంతో అంతో ఏదో చెయ్యాలనే తపన వున్న నాయకుడు వై.యస్.ఆర్ అని చెప్పే ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించారు.

భారం లేదు .. బొంగు లేదు .. మళ్లీ ఎన్నికలు జరగాలి. దోచుకోవడానికి నాయకత్వం వహించే మహా నాయకుడిని ఎన్నుకునే నిర్ణయాన్ని ప్రజలకే అప్పచెప్పాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.