మాసే లక్ష్యంగా రగడ

మరీ ఘోరంగా లేకపొతే మినహా, పెద్ద హిరో మాస్ సినిమా అంటే మినిమమ్ కలక్షన్స్ గ్యారంటీ. “శివ” సినిమా తర్వాత ఎక్సపెరమెంట్స్ పేరుతో రికార్డ్ బ్రేకింగ్ ఫ్లాప్స్ ఇచ్చిన నాగార్జున కు బ్రేక్ ఇచ్చిన మూవీ “ప్రెసిడెంట్ గారి పెళ్ళాం” కూడా మాసే.

శివప్రసాద్‌రెడ్డి అంటే నాకు గుర్తుచ్చే సినిమా “అల్లరి అల్లుడు”. ఆవేశంతో మొదటి మార్నింగ్ షో చూసినపుడు నాకు నచ్చలేదు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత నాకు తెలిసింది “పవర్ ఆఫ్ మాస్” అంటే ఏమిటో. శివప్రసాద్‌రెడ్డి సినిమాలన్నీ మాసే లక్ష్యంగా సాగుతాయి. “బాస్”, “కేడి” ల రూపంలో లాస్ట్ రెండు మూవీలు పెద్ద దెబ్బలు తగిలాయి.

సంగీత దర్శకుడు తమన్ చాలా సినిమాలు చేసాడు కానీ, నాకు ఏ సినిమా పాటలు పెద్దగా నచ్చలేదు. కిక్ సినిమాలో పాటలు కూడా సినిమా చూసాక నచ్చాయి. రగడ సాంగ్స్ మాత్రం ఫస్ట్ వినగానే విపరీతంగా నచ్చేసాయి. అసలు నమ్మకం లేని నాగార్జున “రగడ” సినిమా ఒక్కసారే అంచనాలు పెంచేసాయి. అన్నీ పాటలు ఒకేసారి కలిపి వింటే ఒకే రకంగా మూసలో వున్నట్టు వున్నాయి, కానీ పాటలన్నీ బాగున్నాయి.

1)మీసమున్న మన్మధుడా ..
చాలా బాగుందనిపించింది. భయం లేకుండా పొరాడితే గెలుపు నీదే అంటూ లిరిక్స్ కూడా బాగున్నాయి.

2) శిరిషా .. శిరిషా ..
కొద్దిగా క్లాస్ టచ్ వున్న సాంగ్ .. బాగుంది

3) బొలో అష్టా లక్ష్మి ..
క్లాస్‌గా స్టార్ట్ అయ్యి మంచి మాస్‌తో సాగే పాట. బాగుంది.

4) ఒక్కడంటే ఒక్కడే ..
ఇదే తరహాలో ఈ మధ్య “గోపీచంద్” .. “జగపతి బాబు” పాటలు ఎవో వచ్చాయి. ఈ పాట కూడా బాగుంది ..

5) రగడ .. రగడ ..
ఈ అల్భంలో హైలట్ అనవచ్చు .. ఫ్లూటు బాగా కుదిరింది ..

6) ఏం పిల్లో ..
ఒకే మూసలో సాగిన అల్బం అనిపించి చిన్న చూపుగా వినే సాంగ్ .. మరో మాస్ సాంగ్ .. వెంకటేష్ “జెమినీ” లో సాంగ్ గుర్తొచ్చింది .. but బాగుంది ..

మొత్తానికి మాస్‌ను విపరీతంగా ఆకట్టుకునే అల్భం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.