2010 సంవత్సరంలో నందమూరి > మెగా

మన తెలుగు సినిమా ప్రేక్షకులను నందమూరి అభిమానులు, అక్కినేని అభిమానులు, మెగా అభిమానులు and so on లుగా మన హిరోలు పంచేసుకున్నారు. దానికి ఉదాహరణ ఏ ఫంక్షన్‌లో చూసిన మా వంశాభిమానులంటూ ఆయా హిరోలు ప్రత్యేకంగా అడ్రస్ చేయడం చూస్తూనే వున్నాం.

2010 సంవత్సరంలో నందమూరి వారు మూడు హిట్ సినిమాలు ఇస్తే, మెగా ఫ్యామిలీ మూడు ఫ్లాఫ్ సినిమాలు ఇచ్చారు. బయ్యర్స్ పరంగానే కాకుండా కంటెంట్ పరంగా కూడా నందమూరి వారే డామినేట్ చేసారని చెప్పుకొవచ్చు. “2010 సంవత్సరంలో నందమూరి > మెగా” హెడ్డింగ్ జస్టిఫికేషన్ కోసం “వేదం”, “కల్యాణ్‌రామ్ కత్తి” సినిమాలను పక్కన పెట్టడం జరిగింది. అప్పుడే ఆరెంజ్ ను ఫ్లాఫ్ లిస్టులో కలిపేయడం జరిగింది. (మెగా అభిమానులకు ఎవరికైనా బాద కలిగిస్తే మన్నించండి)

నందమూరి హిట్స్:
అదుర్స్
సింహా
బృందావనం

మెగాఫ్లాప్స్:
వరుడు
కొమరం పులి
ఆరెంజ్

నందమూరి వారి నమ్మకాన్ని దర్శకులు వినాయక్, బోయపాటి శీను, పైడిపల్లి వంశీ నిలబడితే
మెగా వారి నమ్మకాన్ని ఎస్.జె.సూర్య, గుణశేఖర్, భాస్కర్ ముంచేసారు.

మెగా హిరోలు దర్శకులకు ఫ్రీడం ఇవ్వరు అనే ఒక అపవాదు వుంది. ఈ మూడూ ఫ్లాఫ్లు చూసుకుంటే దర్శకులకు ఎక్కువ ఫ్రీడం ఇచ్చి బయ్యర్స్ ను ముంచేసారు అనిపిస్తుంది.

ఈ మూడు మెగా సినిమాలు ఫ్లాఫ్ అవ్వడానికి నేను చేప్పే కారణం “నిర్మాతలు గేట్ కీపర్స్ గా వ్యవహారించడమే” అంటాను. హిరో ఎవరైన, దర్శకుడు ఎవరైనా నిర్మాతే సినిమాను సాసించాలి.

మగధీర సినిమాకు రాజమౌళికి పూర్తి ఫ్రీడం ఇవ్వడం ద్వారా ఇండస్ట్రీ హిట్ సాధించిన మెగా హిరోలు, అదే ఫ్రీడం వేరే దర్శకులకు ఇచ్చి మూడు మెగా ఫ్లాఫ్లు సాధించారు.

తెలుసుకొవలిసిన నీతి:

  • బయ్యర్స్ మెగా హీరో అని ఎగబడి ఎక్కువ రేట్లు పెట్టి కొనవద్దు. సినిమా అనేది వ్యాపారం. మెగా హిరో అయినంత మాత్రానా కచ్చితంగా లాభాలు వచ్చేస్తాయి అనే గ్యారంటీ ఏమీ లేదు. ఎక్కువ రేట్లు పెట్టి కొని, ఫ్లాఫ్ అయితే మెగా హీరోలే బాద్యత వహించాలన్న కొత్త రూల్ పాస్ చేయకండి.
  • ప్రేక్షకులు మెగా హీరో అని ఎగబడి మొదటి రోజే చూసి అప్‌సెట్ కావద్దు.
ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in వేరే వాళ్ళ అభిప్రాయం, సినిమా, Xclusive. Bookmark the permalink.