టిక్కెట్టు రేటు నిర్మాత/బయ్యర్ నిర్ణయించుకోగల్గాలి – రాజమౌళి

ఈ విషయంలో 100% రాజమౌళితో అంగీకరిస్తాను. నాకు మొదటి షో లేదా మొదటిరోజు సినిమా చూసే మజానే వేరు. ఆ ఆనందం కోసం నేను ఖర్చు పెట్టేది నాకు ఎక్కువ అనిపించదు. ఎంతో ఖర్చుపెట్టి సినిమా తీసే నిర్మాతకు, ఎంతో రిస్క్ చేసి కొనుక్కునే బయ్యర్‌కు ఒక సినిమాపై వున్న క్రేజ్‌ను ఆ మాత్రం క్యాష్ చేసుకునే అవకాశం లేకపొతే వేస్ట్.

ఈ వెసులబాటు కల్పించడం వలన నిర్మాతకు ఒక సినిమాపై ఖర్చు పెట్టడానికి ధైర్యం వస్తుంది. భారీగా ఖర్చు పెట్టిన సినిమాలు ఒకటి రెండు సినిమాలు ఫెయిల్ అయినా భారీగా తీయడానికి వెనుకాడరు.

అంత డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టంలేని వాళ్ళు టిక్కెట్టు రేట్లు తగ్గేదాకా ఆగాలి లేదా టి.వి లో ప్రసారం చేసేదాకా వెయిట్ చెయ్యాలి.

ఒకోసారి వెళ్ళాలి అనిపించినా మరీ అంత ఖర్చు పెట్టి ఏమి వెళతాంరా అనుకొని ఆగిపొయిన సినిమాలెన్నో. ఆనందం ఫ్రీగానో తక్కువకో పొందాలనుకొవడం తప్పే కదా అని సరిపెట్టుకుంటాను. టిక్కెట్టు రేటు తగ్గే సమయానికి సినిమా చూడలనే అనిపించదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.