చిరంజీవిపై రాజకీయంగా దాడి చేస్తే రాజకీయం అని సరిపెట్టుకొవచ్చు. రామ్‌చరణ్ సినిమాపై కూడా జగన్’సాక్షి’మీడియా దాడి చేయడం దారుణం. కాసేపు దానిని పక్కన పెడదాం.
ప్రస్తుత రాజకీయలలో నిజాలు మాట్లాడితే ఆ జె.పి లానే బెదిరింపులు, విమర్శలు, దాడులు and so on .. ఏ భద్రత కోసం అయితే మాట్లాడాడో ఆ భద్రతే లేకుండా పొతుంది. నెక్స్ట్ టైం ఆ ఒక్క సీటు కూడా గెలుస్తాడో లేదో చెప్పలేని పరిస్థితి. మా కులం ఓట్లన్ని లాగేసాడు అని ఒక పక్క తెలుగుదేశం, మా తెలంగాణ ప్రాంతంలో పొటి చేసి మా తెలంగాణపైనే వ్యతిరేక మాటలా అని కులం, ప్రాంతం వారిగా ఈ రాజకీయ నాయకులు ప్రజలను విడదీసేస్తున్నారు.
ఒక పక్క ఈనాడు.
ఇంకో పక్క చంద్రబాబు.
వెనక నుంచి చిరంజీవి.
ముందునుంచి కాంగ్రెస్ వృద్దులు.
పై నుంచి కె.సి.ఆర్.
ఇప్పుడు ఇంత మంది లక్ష్యం జగన్ .. జగన్ .. oh my GOD ! వీళ్ళంతా జగన్‌ను రాజకీయంగా చంపేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవం..
రాజకీయలలో దోచుకొవడం అనేది ఒపెన్ సీక్రేట్. చంద్రబాబు, చంద్రబాబు కొడుకు లోకేష్ ఆస్తులు బయట పెడితే జగన్‌కు మించి వుండవచ్చు. అలానే తమ ఆస్తులు కూడా పెంచుకొవాలనే కదా తన సినిమా గ్లామర్‌ను పెట్టుబడిగా పెట్టి చిరంజీవి, ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి కె.సి.ఆర్ రాజకీయలలో ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది ?
ఇక్కడ గొడవంతా నాకంటే నువ్వే ఎక్కువ దోచుకున్నావు. మరీ నీయంత నేను దోచుకోలేదు. నాకూ దోచుకొవడానికి అవకాశం ఇవ్వండి. నేను ఒక్కడినే దోచుకొవాలి. నేనే కాదు, నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళకి కూడా దోచుకునే అవకాశం కలిపిస్తాను. ఇదే రాజకీయం.
ప్రస్తుత రాజకీయలలో జె.పి లాంటి వాళ్ళకి స్థానం లేనప్పుడు, ప్రజలు కోరుకుంటున్న మార్గంలో ఒకే ఒక మగాడు జగన్. ఎంతమంది ఎన్ని రకాలుగా తిప్పలు పెడుతున్నా ఒంటరిగా ధైర్యంగా ముందుకు సాగుతున్న జగన్, ఇదే రకంగా ముందుకు సాగితే రాబోయే ఎన్నికలలో నా ఓటు జగన్‌కే.