గాడి తప్పిన జోశ్యుల సూర్యప్రకాశ్ గారి రివ్యూ

more than 90% తెలుగు సినిమాలు ఫ్లాఫ్ అవుతాయి. హిట్ అయిన సినిమాలో కూడా బొచ్చుడు లూప్ హోల్స్ వుంటాయి. ప్రతి సినిమాలో లూప్ హోల్స్ ఆధారంగా ఏకిపాడేస్తే కచ్చితంగా మన రివ్యూకు అద్భుతం, అత్యద్భుతం అని కామెంట్స్ సంపాదించవచ్చు.

సెలెక్టివ్ మూవీస్ తప్ప, నేను ఎలాగు థియేటర్‌కు వెళ్ళి సినిమా చూసేది లేదు. సినిమా చూస్తున్నప్పుడు కూడా ప్రేక్షకుడిగా కాకుండా, దర్శకుడి కోణంలోనో, ప్రేక్షకులను నచ్చుతుందా అనే విశ్లేషణ కోణంలో చూసే జబ్బు ఒకటి అంటుకుంది. సో కథ తెలిసినా పెద్ద ప్రొబల్మం లేదు కాబట్టి దొరికిన సినిమా రివ్యూ అంతా చదివేస్తూ వుంటాను.

thatstelugu.com లో జోశ్యుల సూర్యప్రకాశ్ గారి రివ్యూస్ బాగా నచ్చేవి. నాకు నచ్చిన సినిమాకు ఈయన రివ్యూ చదివినపుడు మాత్రం ఈయనకు సినిమా మీద అసలు కనికరం లేదని తిట్టుకునే వాడిని.

నాకు ఏదైనా సినిమా నచ్చలేదు అనుకొండి, వెంటనే జోశ్యుల సూర్యప్రకాశ్ గారి రివ్యూ సెర్చ్ చేసి మరీ చదువుతాను. సినిమాపై నాకొచ్చిన కోపం అంతా ఆవిరైపొతుంది. రీసెంట్‌గా ఈయన బెస్ట్ మూవీ క్రిటిక్‌గా ఒక కన్‌క్లూజన్ కు వచ్చాను. ఇంతలోనే తుస్సు మనిపించారు.

Here is the PROOF:
ఈ “కత్తి”(కాంతారావు)పోటు బాగుంది & ఏదైమైనా సరదాగా కాస్సేపు నవ్వుకోవాలనుకోవటానికి సినిమాకి వెళ్ళుతున్నాం అని ఫిక్సయి వెళితే ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేయచ్చు.

First comment to that review:
ఇప్పుడే చూసి వచ్చాను. కాసేపు నవ్వుకుందామనే వెళ్ళాం కానీ దెబ్బ తిన్నాం! ఇంత చెత్త కామెడీ ఈ మధ్యలో చూడలేదు. రెండున్నర గంటల నాన్ స్టాప్ బాదుడు! దీనికంటే ఇంతకు ముందు ఆర్యన్ రాజేష్ తో తీసిన ‘బురిడీ” నయమనిపించింది.

ఇంతకీ నేను చెప్పదల్చుకుంది ఏమిటంటే:
జోశ్యుల సూర్యప్రకాశ్ గారు, ఇలా పాజిటివ్ రివ్యూస్ వ్రాయవద్దు. ఆ సినిమా ఈ సినిమా అని పక్షపాతం చూపించి ‘బాగుంది’, ‘చూడండి’ అని వ్రాయవద్దు. ప్రతి సినిమాను ఏకిపాడేస్తూ బెస్ట్ మూవీ క్రిటిక్‌గా అవార్డు పొందండి. మీ రివ్యూ లక్ష్యం 1) మీ రివ్యూ చదివి సినిమా చూసిన వారెవరూ డిస్సపాయింట్ అవ్వకూడదు. 2) సినిమా చూసి డిస్సపాయింట్ అయిన వారు, మీ రివ్యూ చదివితే రిలీఫ్ అయ్యేలా వుండాలి. నా రిక్వెస్ట్ లో ఎటువంటి వెటకారం లేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.