కె.సి.ఆర్ కరెక్టా ? చిరంజీవి కరెక్టా ?

చంద్రబాబు కామెడీ దీక్ష అనుకున్నది కాస్తా సిరీయస్ అయ్యి ప్రాణాల మీదకు రావడంతో, ప్రభుత్వం చొరవ తీసుకొని భగ్నం చేయడంతో ముగిసింది. కె.సి.ఆర్ మాదిరి చంద్రబాబు కూడా సిలేన్ దీక్షను కొనసాగిస్తాడా అనేది వేచి చూడాలి. చంద్రబాబు ప్రాణలకంటే దీక్ష ముఖ్యం అని తెలుగుదేశం కార్యకర్తలు లొల్లి చిరాకు తెప్పిస్తుంది. కార్యకర్తల హడావుడి తప్ప, రైతుల స్పందన అసలు లేదనేది వాస్తవం. ఈ ఇష్యూకు దీక్షతో పొరాడటం అనేది చాలా ఎక్కువ. రైతులు రాజకీయ దీక్షలకు విసిగిపొయి వున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదక తర్వాత రాబోయే తెలంగాణ ఇష్యూను డైవర్ట్ చేయడానికి కూడా చంద్రబాబు దీక్ష చేయడం ఒక కారణం అనే అపవాదు వుంది.

శ్రీకృష్ణ కమిటీ నివేదకకు కట్టుబడి వుంటాం అని చిరంజీవి అంటున్నాడు.

శ్రీకృష్ణ కమిటీ నివేదక వ్యతిరేకంగా వుంటే మళ్ళీ సిలేన్ దీక్ష చేస్తాను అంటున్నాడు కె.సి.ఆర్.

ఎవరు కరెక్ట్ ?

ఇంచుమించు తెలంగాన ప్రజలందరూ తెలంగాన కోరుకుంటున్నారనేది వాస్తవం. ఎదైనా మాకేంటి అనుకునే కొద్దో గొప్పో తెలంగాన వాళ్ళు , ఎక్కడ వెలి వేయబడతామో అని బయట పడటం లేదు. ఇప్పుడు అయితే వారిలో చాలామంది తెలంగాన కావాలనే అంటున్నారు.

అన్నీ రాజకీయ పార్టీలు ఒకే. కాంగ్రెస్ ఓకే. బి.జె.పి ఓకే. పార్లమెంటులో బిల్లు పెట్టడానికి వెనుకాడటం దేనికి ?

చిరంజీవిది తెలంగానలో ఉనికిని కాపాడుకొవడానికి చేస్తున్న రాజకీయం.

కె.సి.ఆర్ is correct. తెలంగాన ప్రజల అబీష్టం మేరకు తెలంగాన వచ్చేదాకా పొరాడాలి. టి.ఆర్.యస్ కు ఓట్లు వేస్తుంది తెలంగాన కోసమే. ఈసారైనా అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడపాలి.

నిజానికి, అందరూ అంగీకరించాక కూడా తెలంగాన ఇవ్వకుండా శ్రీకృష్ణ కమిటీ వేయడమే పెద్ద వేస్ట్. I am hoping it is going to be favor to KCR

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.