రగడ స్క్రీన్‌ప్లే

సినిమా ఎంతమందికి నచ్చుతుందో గేజ్ చేసే నాలెడ్జ్ నాకు లేదు. అందుకే ఓవరాల్ మూవీ ఫీల్ రేటింగ్ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. రగడ సినిమాలో మాత్రం మ్యూజిక్, కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లేలకు విడి విడిగా రేటింగ్ ఇచ్చే ప్రయత్నం చేసాను. ఈ రేటింగ్ నా నాలెడ్జ్ ఇది, నా ఇష్టాలు ఇవి అని చెప్పే ప్రయత్నం. SO, it may not make any sense to you at all. Feel free to ignore.

రగడ మ్యూజిక్ 5/5.
రగడ కథ 5/5.
రగడ దర్శకత్వం 5/5.
రగడ స్క్రీన్‌ప్లే 4.75/5.

కథ 5/5 అంటే అద్భుతమైన కథ అనుకొకండి. ఈ సినిమా లక్ష్యం మనలోని మాస్ ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేయడం. ఆ లక్ష్యాన్ని సాధించ గల సత్తా కలిగిన సింపుల్ కథ. అందుకే 5/5.

కథ చెప్పడంలో ఇసుమంత కన్‌ఫ్యూజన్ కూడా లేకుండా, కథకు కావలిసిన డైలాగ్స్ తో ఫరఫెక్ట్ గా దర్శకుడు చెప్పాడు కాబట్టి దర్శకత్వం 5/5.

ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, ఎమోషన్‌కు తగ్గా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు అన్నీ సాంగ్స్ కేక.

“పలానా సినిమా చూసారా ? బాగుందా ?” అని అడిగితే, కొందరి నుండి “స్క్రీన్‌ప్లే బాగుందండి, స్క్రీన్‌ప్లే చెడగొట్టిందండి, స్క్రీన్‌ప్లే అద్భుతంగా వుందండి” అని సమాధానం రావడం చాలా సార్లు గమనించాను. వాళ్ళ దృష్టిలో స్క్రీన్‌ప్లే అంటే ఏమిటో తెలుసుకొవాలున్నా, ఎందుకొచ్చిన గొడవలే అని “ఒహో” అని ఊరుకుంటూ వుంటాను.

ఎక్కడో రివ్యూలో ఒడిదుడుకుల స్క్రీన్‌ప్లే అని చదివాను. నేను స్క్రీన్‌ప్లే సూపర్ అనుకొని, సూపర్ మాస్ రగడ 4.75/5 అని రివ్యూ వ్రాస్తే, ఇదేమి టబ్బా?, నాకు అసలు స్క్రీన్‌ప్లే అంటే తెలుసా అని డౌట్ వచ్చింది. నేను స్క్రీన్‌ప్లే అంటే ఏమిటనుకుంటున్నానో పేపరు మీద పెడితే పొలా అని ఈ ప్రయత్నం అన్నమాట:

ప్రేక్షకుడికి నెక్స్ట్ ఏమి జరగబోతుందో ఒక రకమైన కన్‌ఫ్యూజన్‌కు ప్రతి క్షణం గురి చేస్తూ కథ చెప్పడమే స్క్రీన్‌ప్లే. ప్రతి క్షణం అని sentence స్ట్రాంగ్ గా వుండటానికి వాడాను.

ఇంకో రకంగా చెప్పాలంటే ప్రేక్షకుడిని మోసం చేయడం అని కూడా అనవచ్చు. ఇక్కడ మోసం అంటే తప్పు కాదు అని గమనించగలరు.

మన తెలుగు సినిమాలలో ఎక్కువగా కనిపించే స్క్రీన్‌ప్లే ఇలా వుంటుంది:
జరిగిన కథలో కొంత భాగాన్ని దాచేసి, దానిని చివర్లో ప్రేక్షకులకు చెప్పి సర్‌ప్రైజ్ చేస్తారు. ఇటువంటి స్క్రీన్‌ప్లే వలన ఫస్టాఫ్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ఫుల్ ఎంటరటైన్‌మెంట్ గా మలచుకోవచ్చు.

ప్రస్థానం స్క్రీన్‌ప్లే:
ప్రస్థానం సినిమా స్క్రీన్‌ప్లే ప్రత్యేకత ఏమిటంటే, మంచోడు అనుకున్న సాయికుమార్ ఒక్కసారిగా చెడ్డొడా అని అనిపించి, ఇప్పటి దాకా నాకు ఎందుకు మంచోడు అనిపించాడు లాంటి ఎన్నో ప్రశ్నలు క్రియేట్ చేస్తుంది. వెరీ సింపుల్, బట్ పవర్‌ఫుల్ టెక్నిక్. కథ స్ట్రైట్‍గా చెప్పుతున్నట్టు చెప్పి, ఒక్క సీన్‌ను దాచేసాడు. ఆ దాచేసిన సీన్ చూడగానే మొత్తం మనం చూసినదంతా గుర్తు చేసుకొవల్సిన పరిస్థితి వస్తుంది. నాకు ఎందుకు నచ్చలేదు అంటే . స్ట్రైట్‍గా చెపుతూ అలా ఒక సీన్ దాచేయడం నచ్చలేదు.

రగడ స్క్రీన్‌ప్లే:
మెయిన్ కథ స్క్రీన్‌ప్లే, మన తెలుగు సినిమాలలో నార్మల్‌గా వుండే స్క్రీన్‌ప్లేనే. కానీ హిరోయిన్ల కథలో మాత్రం నేను కలలు కనే టెక్నిక్ వాడినట్టు అనిపించి బాగా నచ్చేసింది. ఆ టెక్నిక్: ‘హిరోకి అసలు కథ తెలిసి, తెలియనట్టుగా నటించడం’.

రగడ సినిమాలో నాకు నచ్చనవి ముఖ్యంగా రెండు 1)లాస్ట్ సాంగ్ placement 2) క్లైమాక్స్ ఫైట్.

అవి ఎందుకు నచ్చలేదు అంటే, ట్విస్ట్లు బాగున్నాయి, కథ అంతా తెలిసిపోయింది. ఇక మిగిలింది హిరో విలన్‌ను చంపడం. ఆ సమయంలో పాట, దాని తర్వాత వందమందిని ఒక్కడే మట్టి కరిపించడం అంటే చాలా బోర్ అనిపించింది.

పొకిరీ క్లైమాక్స్:
కథ పూర్తిగా రివిల్ చేయగానే, ఆ ఎమోషన్, ఆ ట్విస్ట్ నుంచి బయటకు వచ్చే లోపలే క్లైమాక్స్ అయిపొతుంది. రగడ కూడా ఈ రకంగా ప్లాన్ చేసుంటే , లాస్ట్ 10 మినిట్స్ బొర్ వుండేది కాదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.