ఆరెంజ్ డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బులు వెనక్కిచ్చిన నాగబాబు

అల్లు అరవింద్ మగధీర సినిమా బాద్యతంతా రాజమౌళిపై పెట్టాడంటే ఎన్నో కారణాలు వున్నాయి. అందులో మొదటి కారణం రాజమౌళి కమర్షియల్ ట్రాక్ రికార్డ్. దిల్‌రాజు పరుగు సినిమాతో ఎన్నో ఇబ్బందులు పడ్డాడని తెలిసి కూడా భాస్కర్‌పై బాద్యత పెట్టి, అంతా అయిపొయిన తర్వాత భాస్కర్‌ ని అంటే ఏమొస్తుంది ?

ఆరెంజ్ సినిమాకు పబ్లిసిటీ చేసి మరికొంత మందికి చేరే ప్రయత్నం చేయకుండా, నెగటివ్ పబ్లిసిటీ చేసి నచ్చిన కొంతమంది కూడా సినిమాలో ఏముంది అనే స్థాయి తీసుకొచ్చిన నిర్మాత నాగబాబు ఆరెంజ్ డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బులు వెనక్కిచ్చాడంట.

సీడేడ్, నెల్లూరు, గుంటూరు మరియు ఉత్తరాంధ్ర లకి కలిపి 2+ కోట్లు వెనక్కి ఇచ్చాడంట. అసలు ఎంతకి అమ్మారో, ఎవరికి ఎంత ఇచ్చారనే విషయం మాత్రం తెలియదు.

వ్యాపారంలో అసలు డబ్బులు వెనక్కి ఇవ్వడం ఏమిటని కొందరంటుంటే, ఇచ్చింది నాలుక గీసుకొవడానికి కూడా సరిపొదు అని మరొకందరు అంటున్నారు. అతిచేసి ఎక్కువ డబ్బులు పెట్టి కొనడం మీదే తప్పు, సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం నోర్ముసుకొని తీసుకొండి అని మరికొందరు అంటున్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.