చెత్త బ్లాగులు .. చెత్త వ్రాతలు .. 1

చిరంజీవిని అభిమానించడానికి కారణం ఆయన సినిమాలు. చిరంజీవి కంటే ఎక్కువగా పవన్‌కల్యాణ్‌ను అభిమానించడానికి కారణం “అక్కడా . ఇక్కడా .. చదివి పవన్‌కల్యాణ్‌ గురించి తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌ వ్యక్తిత్వం”. ఆ వ్యక్తిత్వంలో ఒకటి “అభిమానులను తమ అభిమానాన్ని సినిమా నచ్చితే సినిమాలకే పరిమితం చెయ్యండి .. అభిమానం పేరుతో అనవసరమైన వాటికోసం టైం వేస్ట్ చేసుకొకండి” అని చెప్పడం.

రాంగొపాలవర్మను నేను ప్రత్యేకంగా ఫాలో అవ్వను కానీ, ఆయన carelessnessకి అభిమానిని like pawan kalyan. ఒకోసారి too much చేస్తున్నాడనిపిస్తూ వుంటుంది. చిరంజీవిని కెలికినప్పుడు మాత్రం బూతులు తిట్టుకుంటూ వుంటాను. నా బ్లాగులో నేను చిరంజీవిని విమర్శించినప్పుడు, నన్ను కూడా తోటి చిరంజీవి అభిమానులు అలానే తిట్టుకుంటారా అని అనిపించినపుడు మాత్రం “నేను లేనిది కలిపించి విమర్శంచడం లేదు కదా ..” అని సర్ది చెప్పుకుంటాను. ఎవరి నమ్మకాలు వాళ్ళకి నిజాలు. చిరంజీవి విషయంలో రాంగొపాలవర్మ చెప్పేవి నాకు అబద్దం/వెటకారం అనిపించినా రాంగొపాలవర్మ దృష్టిలో అవి నిజాలు(ఏదో వుద్దేశంతో వ్రాస్తూ, ఆ వుద్దేశాన్ని దాచడం వలన అవి నాకు అబద్దాలు/వెటకారంగా అనిపించాయి).

టైటిల్ జస్టిఫికేషన్ కోసం చాలా పెద్ద పోస్ట్ అయ్యేట్టు వుంది .. will be continued in part 2

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.