అప్పల్రాజు సినిమా exclusive రివ్యూ

సినిమా ఎవరికి నచ్చుతుంది ?
1) తెలుగుసినిమాలన్నీ అక్కడ నుంచి, ఇక్కడ నుంచి కాపీ కొట్టి తీసేస్తున్నారు, అది పెద్ద నేరం అని ఏడ్చే వాళ్ళకు కచ్చితంగా నచ్చాలి. ఒరిజినల్ తెలుగు కథ, తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ను పెద్దవిగా చూపిస్తూ అల్లిన కథ.

2) రెమ్యూనరేషన్స్ తప్ప, ఈ సినిమాకు పెద్దగా ఖర్చుపెట్టి నట్టు కనిపించలేదు. సబ్జక్ట్ కు అవసరం కూడా లేదు.తమ డబ్బుదో ఖర్చు పెట్టేస్తున్నట్టుగా బాద పడి పొతూ, తెలుగుసినిమాకు అంత ఖర్చు అవసరమా అని విమర్సలు చేసే వాళ్ళకు ఈ సినిమా నచ్చాలి.

రాంగోపాలవర్మపై అన్ని విమర్శలు ఎందుకు వచ్చాయి ?
ఇది సినిమా వాళ్ళ కథ అని మొదటి నుంచి చెపుతూనే వచ్చాడు.ఈ సినిమా పెద్ద కాంట్రవర్సీ అన్నట్టుగా పబ్లిసిటి వుండటం, డైరక్ట్ రిఫరెన్స్ లు ఏమీ లేకపొవడం వలనెమో. రాంగోపాలవర్మ తన సినిమాలకు పబ్లిసిటీ చేయకుండా రిలీజ్ చెయ్యాలని వాళ్ళ వుద్దేశం ఏమో.

నీకు నచ్చిందా ?
నేనింతే నాకు బాగా నచ్చింది. ఆ సినిమాలో హిరో అభిమాని ఎలా ఆలోచిస్తాడో అనే క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవ్వడం నేనింతే సినిమా హర్ట్ ను టచ్ చేసింది. నాకు కూడా సినిమా పరిశ్రమలో ఒకడిగా గుర్తింపు పొందాలని ఆశ వున్నా, సునీల్ క్యారెక్టర్ లో ఐడింట్‌ఫై చేసుకొవడం చాలా కష్టం. అందుకే నచ్చలేదు.

డైరక్ట్ గా కెలక కూడదు. కానీ ఇండైరక్ట్ గా కెలకవచ్చు అనే రాంగోపాలవర్మ వాదనతో ఏకీభవిస్తావా ?
NO.  సినిమాలో క్యారెక్టర్స్ నిజ జీవితంలో నుంచి పుట్టేవి అయినా ఇండైరక్ట్ రిఫరెన్స్ లు కూడా నేను ఇష్టపడను. రాంగోపాలవర్మతో ఏకీభవించను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.