వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి .. గుండెల్లోన చేరావే గంటె కొట్టి ..
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి .. కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నదివలె కదిలా నిలబడక .. కలలను వదిలా నిన్ను వెతికా ..
వయసే వరస మార్చినదే .. మనసే మధువు చిలికినదే
అడుగే జతను అడిగినదే .. అలలై తపన తడిపినదే

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి .. గుండెల్లోన చేరావే గంటె కొట్టి ..
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి .. కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ పరిచయమే ఓ పరవశమై .. జగాలు మెరిసెనులే ..
నా యద గుడిలో నీ అలికిడిని .. పదాలు పలుకవులే ..

ఆణువణువూ చెలిమి కొరకు .. అడుగడుగూ చెలికి గొడుగు ..
ఇది వరకూ గుండె లయకు .. తెలియదులే ఇంత పరుగు
వయసే వరస మార్చినదే .. మనసే మధువు చిలికినదే ..

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి .. గుండెల్లోన చేరావే గంటె కొట్టి ..
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి .. కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ ప్రతి తలపు నాకొక గెలుపై .. చుగాలు తొణికేనులే
నీ శ్రుతి తెలిపే కోయిల పిలుపే .. తధాస్తు పలికేనులే ..

గగనములా మెరిసి మెరిసి .. పవనములా మురిసి మురిసి ..
నినుకలిసే క్షణము తలచి .. అలుపు అనే పదము మరిచి ..
వయసే వరస మార్చినదే .. మనసే మధువు చిలికినదే ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుమూవీస్ సాంగ్స్ లిరిక్స్. Bookmark the permalink.