ఏప్రిల్ 14న తీన్‌మార్‌

గణేష్ నెక్స్ట్ సినిమా యంగ్ ఎన్.టి.ఆర్ తో చేస్తున్నాడు. తీన్‌మార్‌ సినిమాను మూడో వారానికి తోసేస్తాడు అని భయపడ్డాను. ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ తీన్‌మార్ ఏప్రిల్ 14న రిలీజ్ అని ఎనౌన్స్ చేయడం ఆనందాన్ని కలిగించే న్యూస్.

ఉహించినట్టుగానే నాలుగు పాటలు దుమ్ము రేపుతున్నాయి. ఏ పాటకదే ప్రత్యేకత కలిగి వుండటం ఈ సినిమా ఆడియో ప్రత్యేకత. పిక్చరైజషన్ కూడా అదర గొట్టినట్టు వున్నారు. పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా స్టెప్స్ వేయడం బాగుంది. మైకేల్ వేలాయుధన్ గా పవన్ కళ్యాణ్ నటన రొటీన్ గా అనిపించినా సబ్జక్ట్ పరంగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకునే అస్కారం వుంది. త్రివిక్రమ్ మాటలు అందించడం పెద్ద ప్లస్. పాటలు, స్టిల్స్, ట్రైలర్స్ అభిమానులను సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసే విధంగా వున్నాయి. సామాన్య ప్రేక్షకులలో మాత్రం మరీ ఎక్కువ అంచనాలు లేకపోవడం కచ్చితంగా మంచిదే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.