మైఖేల్ వేలాయుధం vs అర్జున్ పాల్వాయ్

నేటి కాలపు యువకులు ప్రేమ అంటే ఏమి అనుకుంటున్నారో, తాము నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం ప్రేమను ఏ విధంగా త్యాగం చేయడానికి వెనుకాడారో తెలియచెప్పే పాత్ర మైఖేల్ వేలాయుధం.

ఈ పాత్ర చూస్తుంటే ప్రేమకు విలువ తగ్గిపోతుందా అనే అనుమానం కలుగుతాది. కాని అది నిజం కాదు. ఇప్పటి ప్రేమ ఇంతే అనుకునే మైఖేల్ వేలాయుధంలో అర్జున్ పాల్వాయ్ ఏ విధంగా మార్పు తీసుకొని వచ్చాడన్నదే తీన్‌మార్ సినిమా కథ. మైఖేల్ వేలాయుధం అన్నీ సాధిస్తాడు, ఒక్క ప్రేమ తప్ప. దాని వలన చివరికి ఒంటరిగ మిగులుతాడు. తన తప్పును తెలుసుకొని ప్రేమ పొందడమే తీన్‌మార్ సినిమా కథ.

తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడమే లక్ష్యంగా సాగే ఈ సినిమాలో “ప్రేమ ప్రేమే, కాలంతో సంబంధం లేదు” అని చెప్పడం జరిగింది. ఈ సినిమాను పవన్‌కల్యాణ్ టేకప్ చేయడం మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించడం వలన, “లవ్ ఆజ్ కల్” హిందీ సినిమా చూసిన వాళ్ళకు కూడా ఒక కొత్త సినిమా చూసిన ఫీలింగే వస్తుందనిపిస్తుంది.

సినిమా మొదట్లో మైఖేల్ వేలాయుధం పాత్రలో పవన్‌కల్యాణ్ నటన రొటీన్‌గా అనిపించవచ్చు. సినిమా అంతా అయ్యాక ఆ పాత్ర అలానే వుండాలి, పవన్‌కల్యాణ్ చాలా బాగా చేసాడు, పవన్‌కల్యాణ్ మాత్రమే చేయగలడు అనే విధంగా వుంటుంది.

ప్రేమతో ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే చచ్చేదాకా వదిలే ప్రసక్తి లేదనుకునే వ్యక్తిత్వం అర్జున్ పాల్వాయ్. అర్జున్ పాల్వాయ్ పాత్ర అందరికీ నచ్చే విధంగా వుంటుంది.

జల్సా సినిమా కమర్షియల్‌గా, మ్యూజికల్‌గా హిట్ అయినా కథా పరంగా తెలుగు ప్రేక్షకులను సంతృప్తి పరచలేదు. ఇప్పుడు తీన్‌మార్ ఆ లోటును తీర్చబోతుంది. పరఫెక్ట్ మూవీ ఫర్ పవన్‌కల్యాణ్ & త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబీనేషన్.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.