తీన్‌మార్‌ exclusive రివ్యూ

సినిమా చూసే వాళ్ళ మాట ఎలా వున్నా, సినిమాను విశ్లేషించే వాళ్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సినిమాను విశ్లేషించడం అనే జబ్బు నాకు మెగాస్టార్ “మాస్టర్” సినిమా నుంచి మొదలైంది. ఈ జబ్బు ప్రదాన లక్షణం మనకు ఎలా నచ్చిందో పక్కన పెట్టి, అసలు సినిమా ఎవరికి ఎంత నచ్చుతుంది ? అని ఆలోచించడం. ఇంతటితో ఆగితే సరి, కాని మన విశ్లేషణ పది మందికి చెపితే కానీ చల్లారదు. మన విశ్లేషణ తప్పు అని ఎవరైనా అంటే, కాదు అంటూ మన విశ్లేషణకు వంద సపోర్టింగ్ విశ్లేషణలు తప్పన్న వాళ్లకు చూపించేదాక నిద్ర పట్టదు.

ఈ సినిమా ప్రేక్షకులను ఆరు రకాల కేటగీరిస్ గా విభజించాను.

1) పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి

2) క్లాస్

3) మాస్

4) ‘లవ్ ఆజ్ కల్’ చూసిన వాళ్ళు

5) ‘లవ్ ఆజ్ కల్’ చూడని వాళ్ళు

6) సామాన్య ప్రేక్షకులు

గణేష్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ను అభిమానించడం ఒక addiction లాంటిది. ఆ విషయం పవన్ కళ్యాణ్ ను అభిమానించే వాళ్లకు స్పష్టంగా తెలుసు. పవన్ కళ్యాణ్ అంటే రెండు రకాలుగా పిచ్చి వుంటుంది.

1) ఎనర్జీగా యాక్ట్ చేయడం
2) వ్యక్తిగా ఎవరి జోలికి పోడు

ఎనర్జీగా యాక్ట్ చేస్తాడని అభిమానించడం స్టార్ట్ చేసిన నేను, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి పర్మనెంట్ అభిమానిని అయిపోయాను.

వ్యక్తిగా ఎవరి జోలికి పోడు అనే విషయం ఇప్పుడు అనవసరం కాబట్టి అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానుల్లో నేను ఒకడినిగా ఈ సినిమా చూస్తున్నంత సేపు, చూసాక నాకేమనిపించందంటే:

ఇండియా vs ఆస్ట్రేలియా 50 overs క్రికెట్ మ్యాచ్.

ఇండియా ఫస్ట్ బ్యాటింగ్.

సచిన్ డబుల్ సెంచరీ తో పాటు మిగతా టీం కూడా బాగా ఆడి 400 టార్గెట్.

ఇటువంటి ఇన్నింగ్స్ చూస్తున్నప్పుడు ఒక సచిన్ అభిమాని ఎంత ఆనందం పొందుతాడో, తీన్‌మార్‌ సినిమా చూస్తున్న ప్రతిక్షణం నేను పొందాను.

ఇటువంటి మ్యాచ్ గెలిస్తే ఎక్కువ ఆనందం. గెలవక పోయినా అంత బాదపడను.

ఇంత ఆనందం పొందాక మిగతా కేటగీరిస్ ప్రేక్షకుల గురుంచి ఆలోచించకూడదు అని డిసైడ్ అయ్యి ఇంతటితో ఈ రివ్యూని ఆపేస్తున్నాను.

కమర్షియల్ గా పెద్దగా సక్సస్ కాకపోవచ్చు. కారణం విభిన్నంతో కూడిన సబ్జక్ట్ విభిన్నంగా చెప్పడం జరిగింది. My GUESS తెలుగులో మేజర్ ప్రేక్షకులైన మాస్ కు ఎక్కడం చాలా కష్టం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.