ఎక్సాట్రార్డనరీ కాకపొయినా, నచ్చే దూకుడు ఆడియో

శ్రీనువైట్ల “ఢీ”, “రెడీ” సినిమాలతో దర్శకుడిగా ఒక రేంజ్‌లోకి వెళ్ళిపొయాడు. దుబాయ్ శీను, కింగ్, ఓం నమో వేంకటేశ సినిమాలు పెద్ద హిట్ కాకపొయినా మినిమమ్ గ్యారంటీ డైరక్టర్‌గా నిలబెట్టాయి. ఆయన సినిమాలు ఒకే తరహా డ్రామా ట్రీట్‌మెంట్ అనే ఫీలింగ్ కూడా కలగక మానదు. కానీ శ్రీనువైట్ల సినిమాలు అంటే రొటీన్ అనిపిస్తున్న తరుణంలో శ్రీనువైట్ల మహేష్‌బాబుతో జాయిన్ అయ్యి తన కెరీర్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టే.

తెలుగుసినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవే లాస్ట్ నెంబర్ వన్ అని చెప్పే ప్రిన్స్ మహేష్‌బాబు ఇమేజ్‌లో చిరంజీవికి పూర్తి వ్యతిరేకం. క్లాస్‌కు కూడా నచ్చే మాస్ హిరో చిరంజీవి అయితే, మాస్‌కు కూడా నచ్చే క్లాస్ హిరో మహేష్‌బాబు. మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా ఏలిన నెంబర్ వన్ స్థానంలో వుండటానికి అన్ని అర్హతలు వున్న హిరో మహేష్‌బాబు.

కారణం తెలియదు, ఎందుకో ఎస్.ఎస్.తమన్ మ్యూజిక్‌లో కొత్తదనం ఏమీ వుండదు. “మిరపకాయ్”, “రగడ” సినిమాల మ్యూజిక్ మాత్రం అదరగొట్టాడు. కందిరీగ మ్యూజిక్ అటు తిప్పి ఇటి తిప్పి పాత ట్యూన్సే ఇచ్చాడు. ఇప్పుడు మహేష్‌బాబు ఇచ్చిన అవకాశంతో అందరి దృష్టిలోకి వచ్చాడు.

దూకుడు సినిమా మ్యూజిక్ గురించి నాలుగు ముక్కల్లో:

  1. బాగున్నాయి.
  2. ఎక్సాట్రార్డనరీ కాదు.
  3. ఫస్ట్ హియరింగ్‌లో కొత్తదనం ఏమీ వినిపించలేదు.(కొత్తదనం లేకపొయినా పాతదనం లేకపొవడం ఎడ్వాంటేజ్)
  4. స్క్రీన్ మీద బాగుండే సాంగ్స్ లా అనిపించాయి.

సాంగ్స్ వివరాలు:
1. నీ దూకుడు:
Singer(s): Shankar Mahadevan
Lyrics: Vishwa

మ్యూజిక్ చాలా బాగుంది. శంకర్ మహదేవన్ వాయిస్ వలన రొటీన్ అనే ఫీలింగ్ వచ్చింది. మహేష్‌బాబు మార్క్ సాంగ్.

2. గురువారం
Singer(s): Rahul Nambiar
Lyrics: Rama Jogayya Sastry

క్లాస్ సాంగ్‌లా అనిపించింది.

3.చుల్‌బులి చుల్‌బులి
Singer(s): Karthik, Rita
Lyrics: Rama Jogayya Sastry

రజనీకాంత్ “రోబో”లో సాంగ్ గుర్తుకు వచ్చింది. ఈ సాంగ్‌కు సంబంధించిన ట్రైలర్ కూడా అలానే వుంది.

4. పూవై పూవై
Singer(s): Ramya, Naveen Madhav
Lyrics: Rama Jogayya Sastry

ఐటమ్ సాంగ్. ఫస్ట్ టైం విన్నప్పుడు పెద్దగ ఎక్కలేదు. తర్వాత తర్వాత సూపర్ వుందనిపించింది.

5. దేతడి దేతడి
Singer(s): Ranjith, Divya
Lyrics: Bhaskarabhatla

మాస్ సాంగ్. మంచి కిక్ ఇచ్చే సాంగ్.

6.అదర అదర
Singer(s): Karthik, Koti, Rama Jhogaya Sastry, Vardhini, Ranina Reddy
Lyrics: Rama Jogayya Sastry

ఫంక్షన్ సాంగ్. బాగుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.