అదర అదరగొట్టు

జజజజ జిగేల్ అంది మా ఇంటి పెళ్ళికళ
దిల్‌సే దిల్ ముడి వేసెయ్ మంది వారే వీరై పోయేల
కల్లే కలిపిన అనుబంధంగా .. ఇలలో ఇపుడే సువార్తంగ
ఎదురైయ్యింది చల్లనివేళా.. కళ్యాణలీల

అదర అదరగొట్టు డోలు బాజాలబీటు ఊరు ఉయ్యాలూగేట్టు మోతమ్రోగించేయ్ ట్రంపెట్టు
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు
అరె అరే అరే అదరదరగొట్టు ఇదివరకిలాంటి పెళ్ళిలేనట్టు

మగ పెళ్ళివారమంత వాలిపోయి విడిదింటా
పనిలో పని పల్లకీని మోసుకొచ్చేశామంటా
మనవాడి శ్రీ మహాలక్ష్మీని తీసుకెళతాం మావెంట

ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కట్టేస్తా
అత్తింటి కోడలయ్యి వేలు పట్టి వచ్చేస్తా

అదర అదరగొట్టు డోలు బాజాలబీటు ఊరు ఉయ్యాలూగేట్టు మోతమ్రోగించేయ్ ట్రంపెట్టు
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు

పిల్లేమో ఎరుపు.. బంగారం కలగలుపు
పిల్లోడే కట్మమిచ్చుకోక తప్పదు

ఏ.. మా వాడు మెరుపు .. పోటీలేని గెలుపు
స్విస్ బ్యాంక్ రాసిచ్చుకున్న చాలదు

వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు
తన అదృష్టంతో కలిసొస్తాయి అన్నీ లాంఛనాలు

ఏ.. చూసేస్తున్నాడే వరుడు .. లగ్గమెప్పుడన్నట్టు
ఆమాటే అడిగేస్తుంది పిల్ల బుగ్గల్లో గుట్టు

తాపీగా ఉన్నారేంటు తొందరగిందర లేనట్టు

ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కట్టేస్తా

భూలోకమంతా వెతికి చూసుకున్న ఇట్టాంటి అమ్మడు మీకు దక్కదు
మీకంటి పాపకోరి చేరుకున్న వీరాధి వీరుడు మా నిండు చంద్రుడు

అన్నీ తానై ఉన్నోడు దేవుళ్ళాంటి నాన్న ముందు కోరే వరమే లేదంటా తన సంతోషం కన్నా
అలనాటి రామచంద్రుడు నీలానే ఉండుంటాడు
చిన్నారి జానకి సీతకు చెయ్యందించి వెళ్ళాడు
నీ కన్నతండ్రి కంట్లో వెలిగే ఆనందం చూడు

ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కట్టేస్తా
అత్తింటి కోడలయ్యి వేలు పట్టి వచ్చేస్తా

అదర అదరగొట్టు డోలు బాజాలబీటు ఊరు ఉయ్యాలూగేట్టు మోతమ్రోగించేయ్ ట్రంపెట్టు
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుమూవీస్ సాంగ్స్ లిరిక్స్, సినిమా, Xclusive. Bookmark the permalink.