అక్టోబర్ 6 న యంగ్ ఎన్.టి.ఆర్ ఊసరవెల్లి

ఊసరవెల్లిపై అంచనాలు బాగానే వున్నాయి. అంచనాలకు కారణాలలో ఒకటి యంగ్ ఎన్.టి.ఆర్ అయితే, రెండోది “కిక్” లాంటి సక్సస్‌ఫుల్ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ అందించిన క్రియేటివ్ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వం అందించడం. మొన్నెప్పుడో రిలీజ్ చేసిన ఊసరవెల్లి స్టిల్స్ అంచనాలని తగ్గిస్తే, లీక్ అయిన ఆడియో సాంగ్ అంచనాలు పెంచింది.

అక్టోబర్ 6 నే రిలీజ్ చేయడానికి యంగ్ ఎన్.టి.ఆర్ గ్యాప్ లేకుండా పనిచేస్తున్నట్టుగా న్యూస్ వినిపిస్తుంది. డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రైట్ సినిమాలలో సమానంగా పోటిపడుతున్న సమయంలో పెద్ద హిరోలు ఇలా పనిచేయడం ఆనందించ తగ్గ విషయం.

తెలుగు స్ట్రైట్ సినిమాలకు రామ్’కందిరీగ’ అందించిన విజయాన్ని మహేష్‌బాబు’దూకుడు’, ఎన్.టి.ఆర్’ఊసరవెల్లి’ సినిమాలు కంటీన్యూ చేస్తాయని ఆశీద్దాం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.