సంవత్సరానికి రెండు సినిమాలు కాదు కదా, ఒక్కటి కూడా కష్టమే

సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాను అని చెప్పిన చరణ్ , ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఏమీ కనిపించడం లేదు.

మరోసారి 2011 చరణ్ నటించిన ఒక్కటంటే..ఒక్క సినిమాకూ విడుదల కాలేదు. విడుదలయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ నాటికి గానీ విడుదలయ్యే అవకాశాల లేవు. గతంలో మగధీర తర్వాత విజయోత్సాహంలో చాలా రోజులు గ్యాప్ తీసుకున్న చరణ్ ఆరెంజ్ చేసాడు. ఆ సినిమాతో అనుకున్న ఇమేజ్ సాధించపోవడం వలన ఇప్పుడు మరింత గ్యాప్ తో సినిమా వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవడం చూస్తుంటే అభిమానులు నిరాశకు గురికాక తప్పడం లేదు.

ఈ మధ్య పోలో టీం, ఇతర వ్యవహారాలతో బిజీగా గడుపుతున్న చరణ్…..ఎప్పుడో తనకు ఖాళీ సమయం చిక్కినప్పుడు మాత్రమే రచ్చ షూటింగులో పాల్గొంటున్నాడట. అందుకే సినిమా ఆలస్యం అవుతుందనేది ఫిల్మ్ నగర్ టాక్. ఆ డైరక్టర్ తో సినిమా, ఈ డైరక్టర్ తో సినిమా అని న్యూస్లు వస్తున్నాయి తప్ప, ఏ సినిమా కూడా ఫైనల్ అవ్వడం లేదు.

Year Movie Name
2007 చిరుత
2008 మగధీర
2009 ——–
2010 ఆరెంజ్
2011 ——–
ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.