దూకుడులో చరణ్ గెటప్ గురించి యం. యస్. నారాయణ ఏమన్నారు ?

9:32 AM EST, Sept 22, 2011:
ఇప్పుడే దూకుడులో చరణ్ గెటప్ గురించి యం. యస్. నారాయణ గారితో మాట్లాడాను.

నా ప్రశ్న:
సార్ .. ఇక్కడ(USA) మహేష్‌బాబుకు చాలా క్రేజ్, దూకుడు సినిమాపై చాలా అంచనాలు వున్నాయి. ట్రైలర్స్ మీ గెటప్ చూసి చాలామంది మీరు చరణ్‌ను వెటకారం చేసారెమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజం ఏమిటి సార్ ?

ఆయన జవాబు:
కరెక్ట్ కాదు. నేను దూకుడు సినిమా ఒకే సీను‌లో నాలుగు హిరోలను అనుకరిస్తాను 1) చరణ్ 2) ఎన్.టి.ఆర్ 3) బాలకృష్ణ 4) రజనీకాంత్

ఆ సినిమాలో నా క్యారెక్టర్ హిరో అవుదామని సొంతంగా వ్రాసుకున్న సీన్స్ మహేష్‌బాబుకు యాక్షన్ చేసి చూపించడం జరుగుతుంది. అవి ఆయనకు విపరీతంగా నచ్చి, నా క్యారెక్టర్ కు అవకాశం ఇచ్చి, నా క్యారెక్టర్ అడ్డు పెట్టుకొని విలన్స్‌ను కబడ్డీ ఆడేస్తూ వుంటాడు.

ఈ సినిమాలో ఈయనకు మంచి క్యారెక్టర్ దొరికందని కూడా చెప్పారు. చరణ్ మీద వెటకారం ఏమీ వుండదు. ఇమేజ్ పెంచే విధంగా వుంటుందని కన్‌ఫర్మ్ గా చెప్పారు.

Thank You Purna for having MS on the phone

http://hari.pawanfans.com/?q=node/186

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.