బాక్సులు బ్రద్దలు కొడుతున్న మహేష్ బాబు దూకుడు

పోకిరి సినిమా ఇంత భారీ రిలీజ్ లేదు. ఆ సినిమాతో రిలీజ్ అయ్యిన మిగతా సినిమాలు ప్లాఫ్ టాక్ తో పోకిరి సినిమా థియేటర్స్ సంఖ్య పెరిగినట్టు గుర్తు. వినోదం కోసం, మహేష్ బాబు కోసం దూకుడు తప్పకుండా చూడవచ్చు అని టాక్ తో పాటు రెండు వారల వరకు వేరే పెద్ద సినిమాలు లేకపోవడం, దసరా హాలీడేస్ వలన ఓపినింగ్స్ లో దూకుడు నెం 1 మూవీ అంటున్నారు. పోకిరి రికార్డ్స్ గల్లంతు. త్వరలో రిలీజ్ కాబోయే పెద్ద సినిమాలు బాగోపోతే మగధీరను కొట్టిన ఆశ్చర్య పోవక్కర్లేదు అంటున్నారు.

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన దూకుడు పలు సంచలనాలు సృష్టిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద మహేష్ బాబు ఒక తిరుగులేని హీరోగా దూకుడు నిరూపించింది. గోదావరి జిల్లా లో కలెక్షన్ల పరంపర కురిపిస్తోంది. పశ్చిమ గోదావరి లో అత్యధికం గా 23 సెంటర్ల లో విడుదల అయిన దూకుడు , సుమారు 44 లక్షల రూపాయలు వసూలు చేసింది. తూర్పు గోదావరి లో సుమారు 43 లక్షలు రాబట్టింది. ఈ రెండూ గోదావరి జిల్లా రికార్డులే. ఈ కలెక్షన్ల సునామి మరికొన్ని రోజులు ఇలానే కొనసాగుతుంది అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమ గర్వించే విధం గా మహేష్ బాబు దూకుడు దుమ్ము దులుపుతోంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.