సౌత్ ఇండియా సినిమాను షేక్ చేసే రోజు కోసం వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాను అన్న దమ్ములైన సూర్య, కార్తిక్ లు షేక్ చేసేస్తున్నారు. అదే విధంగా నేను చరణ్ కూడా చేసే రోజు రావాలని ఆశీస్తున్నాను. – అల్లు అర్జున్

ఎ.ఆర్.మురుగదాస్ దర్సకత్వంలో సూర్య, శృతిహాసన్ జంటగా నటించిన 7thసెన్స్ ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ అన్న పై మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సూర్య కథానా యకుడిగా నటించిన సినిమా ‘7th సెన్స్‌’. ‘చూడని అవతారం’ అనేది ఉపశీర్షిక. శృతిహాసన్‌ కథానాయిక. మురుగదాస్‌ దర్శకుడు. తమిళ మాతృక పేరు ‘ఏళాయుం ఆరివు’. లక్ష్మిగణపతి ఫిలింస్‌ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. హారిస్‌ జైరాజ్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. తొలిసీడీని రామ్‌చరణ్‌తేజ్‌ ఆవిష్కరించి సూర్య సోదరుడు, హీరో కార్తీకి అందించారు. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో సూర్య, శృతిహాసన్‌, సుబ్రహ్మణ్యం, హారిస్‌ జైరాజ్‌, భువనచంద్ర, పరుచూరి వెంకటేశ్వరరావు, అల్లు అరవింద్‌, రాజమౌళి, వి.వి.వినాయక్‌, అల్లు అర్జున్ , అంబికా కృష్ణ, నిఖిత నారాయణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా. Bookmark the permalink.