ఊసరవెల్లికి దూకుడు రేంజ్‌లో కలక్షన్స్ వస్తాయా ?

దూకుడు సినిమాలో ప్రేక్షకులకు కావలసిన అంశాలు చాలా వరకు వున్నాయి. అందుకే కథాబలం లేకపొయినా, సాంగ్స్ అంచనాల మేరకు ఆకట్టుకొలేక పొయినా కనివిని ఎరుగని రీతిలో కలక్షన్స్ వర్షం కురిపిస్తుంది. మెయిన్ ప్లస్ పాయింట్ మహేష్‌బాబు అయితే, రెండో ప్లస్ పాయింట్ ఆ ఇమేజ్‌ను కరెక్ట్‌గా యూజ్ చేసుకొని ప్రెజెంట్ చేసిన శ్రీనువైట్ల.

ఊసరవెల్లికి ఆ రేంజ్‌లో కలక్షన్స్ వస్తాయా అన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

అతి చిన్న వయసులో అతి పెద్ద మాస్ ఇమేజ్ సంపాదించుకున్న హిరో యంగ్ ఎన్.టి.ఆర్. ఆది, సిహాంద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్‌తో మాక్సిమమ్ రేంజ్‌కు చేరుకున్నాడు.

రీసెంట్‌గా యమదొంగ, అదుర్స్, బృందావనం లాంటి కమర్షియల్ సేఫ్ ప్రొజెక్ట్స్ చేసినా తన స్టామినాకు తగ్గ ఫిలింస్ కాదు. కాకపొతే ఆ మూడు సినిమా ఒక కొత్త ఇమేజ్‌ను సంపాదించిపెట్టాయి.యమదొంగలో సన్నగా అలరిస్తే, అదుర్స్ లో కామెడీని పండించాడు. బృందావనంలో మీసాలు లేకుండా ఆకట్టుకోగల్గాడు.ఊసరవెల్లి ట్రైలర్స్ చూస్తుంటే బృందావనం క్యారెక్టర్‌కు extensionగా వుంది.

దూకుడు సినిమాకు శ్రీనువైట్ల ఎలా వెన్నుమొకగా నిలిచాడో ఊసరవెల్లికి కూడా సురేందర్‌రెడ్డి వున్నాడు.యాక్షన్ చిత్రాలకే పరిమితం అనుకున్న సురేందర్‌రెడ్డి “కిక్” సినిమాలో క్రియేటివిటీ కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించి అందరనీ ఆశ్చర్య పరిచాడు.

మాస్ హిరో యంగ్ ఎన్.టి.అర్ , క్రియేటివ్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ఊసరవెల్లి సినిమాకు దూకుడు రేంజ్‌లో కలక్షన్స్ వచ్చే అవకాశం వుంది. కాని

మీసాలు లేని ఎన్.టి.ఆర్ ను మాస్ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. నాకు బృందావనం అంతగా నచ్చకపొవడానికి కారణం మీసాలు లేని ఎన్.టి.ఆర్ ను చూడలేకపొవడమే. దూకుడు రేంజ్‌లో కలక్షన్స్ రాకపొయినా, ఈ సినిమాకు మంచి ప్రశంసలు(both సురేందర్‌రెడ్డి & ఎన్.టి.ఆర్ ) వస్తాయనుకుంటున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.