మహేష్‌బాబు దూకుడు కమర్షియల్ బ్లాస్ట్‌తో పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి

ఖుషి సినిమా తర్వాత పవన్‌కల్యాణ్‌కు ఆ రేంజ్‌లో టాక్ వచ్చి హిట్ అయిన సినిమా లేదు అనేది పబ్లిక్ టాక్. ఢీ, రెడీ , కింగ్, నమో వెంకటేశ, దూకుడు సినిమాలతో ఇప్పుడు మంచి ఫామ్‌లో వున్న దర్శకుడు శ్రీనువైట్ల అందించే డ్రామా లాంటి కామెడీ సినిమా పవన్‌కల్యాణ్ ఎప్పుడో “గుడుంబా శంకర్” లో చేసాడు. ఆ సినిమా తర్వాత చేసిన మాస్ సినిమాలు, మాస్‌ను ఆకట్టుకొవడం ఎలా వున్నా పవన్‌కల్యాణ్ అభిమానులలో ఎంతో నిరుత్సాహాన్ని నింపాయి. జల్సా తీన్‌మార్ లాంటి పవన్ మార్క్ సినిమాలు చేసినా, అందులో పవన్‌కల్యాణ్ రొటీన్(తనను తాను ఇమిటేడ్ చేసుకుంటున్నాడు) అనిపించాడు తప్ప కొత్తదనం కనిపించలేదు.

ఖలేజ‌ కమర్షియల్‌గా ప్లాఫ్ అయ్యిందని నిరుత్సాహ పడినా, పది సినిమాలకు సరిపడా ఉత్సాహం దూకుడు సినిమాతో మహేష్‌బాబుకు అందింది. మహేష్‌బాబు దూకుడు హిట్‍‌ పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి తెచ్చేలా వుంది. తెలుగు ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్, పూరి జగన్నాథ్, రాజమౌళి లు పవన్‌కల్యాణ్‌‍తో చేయడానికి తమ సిగ్నల్స్ పంపించినా, వారిని కాదని తమిళ్ దర్శకుల కథలపైనో రిమేక్‌లపైనో తన దృష్టిని సారిస్తున్న పవన్‌కల్యాణ్ మనసు మారాలని కొందరు అభిమానులు కోరుకుంటున్నారు.

నాలాంటి అభిమానులు మాత్రం పవన్‌కల్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ’తీన్‌మార్’ చేసినట్టు చేస్తే చాలు అనుకుంటున్నారు. దర్శకుడు పవన్‌కల్యాణ్ స్టామినాతో పాటు ప్రేక్షకుల నాడి తెలిసిన వాడయితే కమర్షియల్ హిట్ దానంతట అదే వస్తుంది. నాకయితే నెక్స్ట్ రెండు సినిమాలపై భారీ అంచనాలే వున్నాయి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.