అతివేగంగా పవన్‌కల్యాణ్ గబ్బర్‌సింగ్

పవన్ కల్యాణ్ హీరోగా ‘గబ్బర్‌సింగ్’ అనే టైటిల్‌తో సినిమా అంటేనే అదో ఇంటరెస్ట్ క్రియేట్ అవుతోంది. పవన్ వంటి స్టైలిష్ యాక్టర్‌కి ‘గబ్బర్‌సింగ్” అనే ఫుల్ మాస్ టైటిల్ తోడయ్యి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. బాలీవుడ్‌ సల్మాన్‌ఖాన్ నటించగా సూపర్‌హిట్టయిన ‘దబాంగ్’కి రీమేక్. మొదట ‘షాక్’ తిని, తర్వాత ‘మిరపకాయ్’తో తేరుకున్న హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బండ్ల గణేశ్ నిర్మిస్తున్నాడు.

సల్మాన్ బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా తెరకెక్కిన ‘దబాంగ్’ హిందీలో ఎంత సూపర్‌హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్‌కు తగ్గట్టు, ఆయన మేనరిజానికి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి పూర్తి స్థాయి మాస్ క్యారక్టర్‌తో ఫుల్ మీల్స్‌గా సిద్ధం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కంటిన్యూగా యాభై రోజుల షెడ్యూల్ లో పాల్గొనటానికి ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. అక్టోబర్ పదవ తేది నుండి పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు. ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై పోయి కొన్ని పవన్ లేని సీన్స్ షూట్ చేసేస్తున్నారు. ఇక తమిళనాడులోని పొల్లాచ్చి ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది.అక్కడ జాయిన్ అవుతారు పవన్ కళ్యాణ్. యాభై రోజుల షెడ్యూల్ లో మాగ్జిమం టాకీ పార్ట్ అవకొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ నటిని ఒప్పించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ రెండు పాటల రికార్టింగ్ పూర్తి చేసారు. నిర్మాత గణేష్ బాబు..ఎట్టి పరిస్దితుల్లోనూ అతి వేగంగా నిర్మించాలని నిర్ణయించుకున్నారట. ఆంజనేయులు, తీన్‌మార్ సినిమాలు అదే విధంగా అతి తక్కువ కాలంలో నిర్మించిన ట్రాక్ ఆయనకు వుంది ఈ చిత్రంలో శృతిహాసన్, జయసుధ, అజయ్, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్, సినిమాటోగ్రఫీ: జయనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కళ: బ్రహ్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.