పవన్‌కల్యాణ్ ’పంజా’ – మాస్ స్టైలిష్ మూవీ

పబ్లిసిటీ అంటే “మా సినిమా నుంచి ఇవి ఆశీంచండి” అంటూ ప్రేక్షకులను సిద్ధం చేయడం. – రాజమౌళి

ఒక సినిమాను ఎన్ని అభ్యుదయ భావాలతో నిర్మించినా, సినిమా నిర్మాణం చివరికి వచ్చేటప్పటకి నిర్మాతలకు తాము ఖర్చు పెట్టిన డబ్బులే కనిపిస్తాయి. సో పబ్లిసిటీ లక్ష్యం జనాలను ఏదో రకంగా థియేటర్ కు లాక్కురావడమే మారిపోతాది. – xyz

పవన్‌కల్యాణ్ ’పంజా’ పబ్లిసిటీలో భాగంగా మూవీ టైటిల్, మూవీ స్టిల్స్ రిలీజ్ చేసారు. టైటిల్ మాస్‌ను అలరించి ఆకట్టుకునే విధంగా వుంటే, స్టిల్స్ స్టైలిష్‌గా వున్నాయి.

గ్రేట్ పబ్లిసిటీ బట్ వరస్ట్ ప్రి-రిలీజ్ పబ్లిసిటీ అంటే నాకు గుర్తు వచ్చే మెగా సినిమాలు ’వరుడు’ ’బద్రీనాథ్’ .. అవి కేవలం ప్రేక్షకుడిని థియేటర్‌కు లాక్కోచ్చే కోణంలోనే జరిగాయి. వరుడు అనే ఒక యాక్షన్ మూవీని కుటుంబ కథా చిత్రంగా ప్రొజెక్ట్ చేసి మోసం చేసారు. పబ్లిసిటీ చూసి ఫీల్ గుడ్ మూవీకి వెళ్ళుతున్నాం అని వెళ్ళి అప్‌సెట్ అయినా చాలా మందిని చూసాను. అలానే ‘బద్రీనాథ్’ ఒక మాస్ లవ్ స్టోరి మూవీని ’ఒక అద్భుతమైన భక్తి కథ’ అని ప్రొజెక్ట్ చేసి తప్పు ద్రోవ పట్టించారు. సినిమా అనేది వ్యాపారం కాబట్టి అది సహజం.

కేవలం ప్రేక్షకుడిని థియేటర్‌కు లాక్కోచ్చే కోణంలోనే కాకుండా రాజమౌళి చెప్పినట్టు పబ్లిసిటీ అంటే “మా సినిమా నుంచి ఇవి ఆశీంచండి” అంటూ ప్రేక్షకులను సిద్ధం చేసే కోణంలో పవన్‌కల్యాణ్ ’పంజా’ పబ్లిసిటీ చేస్తున్నారని ఆశీద్దాం.

నిన్నటి పబ్లిసిటీ పవన్‌కల్యాణ్ ’పంజా’ – మాస్ స్టైలిష్ మూవీ అనే ఫీల్ క్రియేట్ చేసింది. మూవీ ట్రైలర్స్ .. ఆడియో కోసం ఆత్రంగా ఎదురుచూసేలా చేసాయనే చెప్పవచ్చు. కొత్తదనం + మాస్ వుంది. ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవ్వలేదంటున్నారు కాబట్టి, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఏ విధంగా వుండబోతుందనే క్లూ ఇస్తే బావుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ 100% నచ్చుతుందనే నమ్మకం వుంటే, సర్‌ప్రైజ్ గా వుంచవచ్చు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.