ఊసరవెల్లి బావుంది .. కానీ

సినిమా ఎలా వుంది ?
బావుంది.

ఎన్.టి.ఆర్ ఎలా చేసాడు ?
నా దృష్టిలో ఆది, సిహాంద్రి సినిమాలతో ఎన్.టి.ఆర్ యూత్ హిరోలలో నెం. 1 మాస్ హిరో అనిపించుకున్నాడు. ఒక రేంజ్‌కు చేరుకున్నాక ఇంకా ఎక్కడికి చేరుకొవాలో తెలియక టూ మచ్ మాస్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనం సినిమాలు చేసాడు. ఆ సినిమాల పక్కన డౌట్ లేకుండా చేరే మరో సినిమా ఊసరవెల్లి.

దూకుడు ఓపినింగ్స్, మగధీర ఓవరాల్ కలక్షన్స్ బద్దలవుతాయా ?
ఈ ప్రశ్నలతో సినిమా చూస్తే సినిమా బావుందనిపించదు. ఫ్లాప్ అంటారు.

సినిమా ఫ్లాప్ ? ఎవరేజ్ ? హిట్ ? సూపర్ హిట్ ? రేటింగ్ ఎంత ? సినిమా చూడవచ్చా ?
ఈ సినిమాలో ప్రేక్షకులు కోరుకునేవి వారు కోరుకున్న విధంగా లేకపొవచ్చు. ఒక మూవీ లవర్‌కు నచ్చే అంశాలు చాలా వున్నాయి. ఫ్లాప్, ఎవరేజ్, హిట్, సూపర్ హిట్ .. I don’t care. సినిమా బావుంది. ఎన్.టి.ఆర్ నుంచి ఆశీంచే అంశాలు కాకుండా, కొన్ని అతిగా చేసిన అర్దం పర్దం లేని యాక్షన్ సీక్వీన్సన్ లైట్‍‌గా తీసుకొని చూస్తే సినిమా ఉత్కంఠగా చూడటం ఖాయం.

ఈ సినిమా గొప్పతనం ఏమిటి ?
కథ. నాలుగైదు హాలీవుడ్ సినిమాల నుంచి స్పూర్తి పొంది అల్లిన కథ అయినా ఎక్సట్రార్డినరీగా వుంది. స్క్రీన్‌ప్లే కూడా చాలా బావుంది.

ఏమి బాగోలేదు ?
1) ఎన్.టి.ఆర్ మీసాలు లేకుండా ఎందుకు నటించవలసి వచ్చిందో నాకైతే అర్దం కాలేదు. మహేష్‌బాబును తప్ప ఏ పెద్ద హిరోను మీసాలు లేకుండా నేను చూడలేను. మాస్ తెలుగు ప్రేక్షకులు కూడా నాలానే ఆలోచిస్తారని అనుకుంటున్నాను. మీసాలతో నార్మల్‌గా వుంటే టాక్ & రిజల్ట్ మరో విధంగా వుండేదని నా నమ్మకం. 2) ఎన్.టి.ఆర్ లాంటి మాస్ హిరోతో టూ మచ్ ఎక్సపరమెంటేషన్ చేయడం చాలా పెద్ద సాహసం. సాహసం కొద్దిగా తగ్గించి, పాటలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చేయవలసిందనిపించింది. ౩) యాక్షన్ పార్ట్ కొద్దిగా కంట్రోల్డ్‌గా చేయవలసింది.

చివరిగా ?
నాకు నచ్చింది. ఊసరవెల్లి బావుంది .. కానీ ఒక మాస్ హిరోతో ఎక్సపరమెంట్ చేయవచ్చు. ఒకేసారి టూ మచ్ ఎక్సపరమెంటేషన్ చేయడం మంచిది కాదనిపించింది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.