బృందావనం, ఊసరవెల్లి సినిమాలలో మీసాలు లేకుండా లవర్ బాయ్ గా కనిపించిన యంగ్ ఎన్.టి.ఆర్ ఇప్పుడు గోపిచంద్ ‘మొగుడు’ ఆడియో ఫంక్షన్ లో సరికొత్త మీసకట్టుతో కనిపించారు. ఈ మీసకట్టు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సినిమా బాలకృష్ణ ‘సింహా’ ను పోలి వుండటంతో , బోయపాటి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ నెక్స్ట్ సినిమా ‘దమ్ము’ సినిమా గెటప్ అని అనుకుంటున్నారు.
తెలుగు ప్రేక్షకులకు మూస ధోరణిలో ఒకే రకమైన సినిమాలు అందించకుండా, ఇలా కొత్తరకంగా కనిపించడానికి ఆరాట పడుతున్న మన తెలుగు హీరోలను అభినందించాలి, ఆదరించాలి. అప్పుడే మన హీరోలు ఎక్సపరమెంట్స్ చేయడానికి ధైర్యం ఉత్సాహం వస్తాయి. మన తెలుగు సినిమా స్థాయి పెరిగి వేరే రాష్ట్రాలకు కూడా వ్యాపించే అవకాశం వుంది.
I liked it and good luck to young NTR
ప్రకటనలు