చూస్తున్నా .. చూస్తూ వున్నా .. చూస్తూనే వున్నా ..

చూస్తున్నా .. చూస్తూ వున్నా .. చూస్తూనే వున్నా ..
ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని …ఇన్నాళ్ళూ నాకే తెలియని
నన్ను నేనే నీలో …

చూస్తున్నా .. చూస్తూ వున్నా .. చూస్తూనే వున్నా ..

పచ్చని మాగాణి చేలు పట్టుచీరగా కట్టి ..
బంగారు ఉదయాన సిరులు నొసట బసికంగా చుట్టి ..
ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది ..
పున్నమి పదహారు కళలు సిగలో పువ్వులుగా పెట్టి ..

దేవేవిగా .. పాదం పెడతానంటూ ..
నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ ..
నవ నిధులు వధువై వస్తుంటే …
సాక్షాతూ శ్రీమాన్ నారాయణుడే నేనైనట్టు ..

చూస్తున్నా .. చూస్తూ వున్నా .. చూస్తూనే వున్నా ..

నువ్వు సేవిస్తుంటే నేను సార్వభౌముడ యిపోతాను ..
నువ్వు తోడై వుంటే సాగరాలు దాటేస్తాను ..
నీ సౌందర్యంతో ఇంద్ర పదవినేదిరిస్తాను ..
నీ సాన్నిధ్యంలో నేను స్వర్గమంటే ఏదంటాను …

ఏళ్ళే వచ్చి వయసే మల్లిస్తుంటే ..
నేనే నీవొళ్ళో ఆపగా చిగురిస్తుంటే …..చూస్తున్న …..

చూస్తున్నా .. చూస్తూ వున్నా .. చూస్తూనే వున్నా ..

ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని …ఇన్నాళ్ళూ నాకే తెలియని
నన్ను నేనే నీలో …

చూస్తున్నా .. చూస్తూ వున్నా .. చూస్తూనే వున్నా ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుమూవీస్ సాంగ్స్ లిరిక్స్, సినిమా. Bookmark the permalink.