కృష్ణవంశీ ‘మొగుడు’ ఆడియో – మై టాక్

కృష్ణవంశీ సినిమా అంటే ఆర్టిస్టులు పడి చస్తారు. కృష్ణవంశీ సినిమాలో చేస్తే ఆ సినిమాలో చేసాం అనే సంతృప్తి మాత్రమే కాదు, ఇంకో పది సినిమా అవకాశాలు తెచ్చిపెడుతుంది. చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా బాగా ఎలివేట్ అవుతారు. అదే సంతృప్తిని ప్రేక్షకులకు అందించడంలో కృష్ణవంశీ ఫెయిల్ అవుతున్నాడు. దానితో పాటు కృష్ణవంశీతో సినిమా చేసే నిర్మాతలు బికారులు అయిపోవడం ఖాయం అనే విమర్శ కూడా వుంది.

ఆర్టిస్టుల సంతృప్తి కృష్ణవంశీ పై విమర్శలు పక్కన పెడితే, కృష్ణవంశీ సినిమాపై అంచనాలు ఇంకా చెక్కు చెదరలేదు. అంచనాలకు తగ్గట్టుగా నిరాశ పరచని విధంగానే కృష్ణవంశీ ‘మొగుడు’ సాంగ్స్ వున్నాయి. ఓవరాల్ గా లేడిస్‌ను బాగా ఆకట్టుకునే విధంగా వుందని చెప్పవచ్చు.

1) Kavali Kavali: కచ్చితంగా లేడిస్‌కు బాగా నచ్చే సాంగ్. బాగుంది.

2) Bachelor Boys: బాగుంది. సరదాగా వుంది. మగాళ్ళకు నచ్చే సాంగ్.

3) Choosthunna: హైలట్ క్లాస్ సాంగ్.

4) Aakalakalaka: హూషారుగా వుంది. స్క్రీన్ మీద బాగుండే సాంగ్ అనిపించింది.

5) Eppudu Nee Roopamlo: టూ క్లాస్ అండ్ స్లో .. హ్యాపీడేస్ పాటను పోలి వుంది.

6) Nuvvante Naku: హాట్ సాంగ్. మైఖల్ జాక్సన్ సాంగ్ లా అనిపించింది.

7) Ettantee Mogudu: లేడిస్ మాస్ సాంగ్ .. బాగుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.