రాజమౌళి – Next TO శ్యాంప్రసాద్‍రెడ్డి

రాజమౌళి స్టాంప్ వేసుకునే తీరుచూసి చాలా extras చేస్తున్నాడు అనుకునే వాడిని. ‘మగధీర’ సినిమా చూసాకా నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. He is 100% Right. “చరణ్ కాకపొతే ఈ కథ పుట్టేదే కాదు. ఇంత అద్భుతమైన సినిమా చూసేవాళ్ళమే కాదు.” ఇంకో విధంగా చెప్పాలంటే “చరణ్ కాకపొతే మగధీర అనే సినిమా వుండేది కాదు”.అదే వేరే విషయం. before మగధీర ఆయన సినిమాలలో వుండే ఒవర్ వయలెన్స్, ఒవర్ ఎక్సపోజింగ్, ఒవర్ వల్గారిటీ చాలా మందికి చ్చేవి కావు. ఆయన ఒక కమర్షియల్ దర్శకుడు అనుకునేలా చేసాయి. .. from మగధీర .. ఒవర్ వయలెన్స్, ఒవర్ ఎక్సపోజింగ్, ఒవర్ వల్గారిటీ తగ్గించాడని అనుకుంటున్నాను.

మగధీర సినిమా చూసాక రాజమౌళికి శ్యాంప్రసాద్ రెడ్డి పునాడా అని అనిపించింది. అంటే శ్యాంప్రసాద్ రెడ్డి రాజమౌళిలో ప్రవేశించి ఈ సినిమా తీసాడా అని అనిపించింది. మగధీర ప్రేక్షక నీరాజనాలు చూసాక శ్యాంప్రసాద్ రెడ్డికి వున్న కమిట్ మెంట్ రాజమౌళికి కూడా వున్నట్టుగా అనిపించింది. శ్యాంప్రసాద్ రెడ్డి కి అభిమానులను ఆకట్టుకోవడం ప్లస్ పోరాట దృశ్యాలపై ఇంత పట్టు వుంది అని నేను అనుకోను. శ్యాంప్రసాద్ రెడ్డి సెంట్ మెంట్ ను ఆయుధంగా వాడుకుంటాడు.(ఆయుధం, మార్గం ఏదైనా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే వారి లక్ష్యం అనుకోండి)

మగధీర ప్రత్యేకత ఏమిటంటే
1) భారీ అంచనాలతో వచ్చిన మగధీర సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించడం టఫ్ అండ్ బిగ్గర్ జాబ్.
2) ప్రతి హిరో , హిరోతో పాటు హిరో అభిమానులు కోరుకునే హిరోచిత చేజ్ సీన్లు, పోరాట దృశ్యాలు హైలట్ కావడం.
3) అంజి-చిరంజీవి తో ఫ్యాన్స్ ఆశించిన సినిమాను శ్యాంప్రసాద్ రెడ్డి అందించలేక పోయినా, మగధీర-చరణ్ తో రాజమౌళి ఫ్యాన్స్ కు అందించాడు.

అమ్మోరు సినిమాకు చిరంజీవి దగ్గరనుండి తెలుగుసినిమా ప్రముఖులందరూ అభినందనలు తెలిపారు. తెలుగుసినిమా చరిత్రలో అదొక అద్భుత చిత్రంగా నిలిచింది. అదే రకంగా ప్రేక్షకాదరణ కూడా లభించింది. ఇప్పుడు ’ఈగ’ సినిమా రాజమౌళి కమిట్‌మెంట్, కాన్ఫిడెన్స్ చూస్తుంటే శ్యాంప్రసాద్ రెడ్డి’అమ్మోరు’ సినిమాలా వండర్స్ క్రియేట్ చేస్తుందనిపిస్తుంది.

ఒక చిన్న సినిమాకు ఇంత ఖర్చు, ఇన్ని రోజులు పని చేయడం-కలక్షన్స్ పెద్ద సినిమాకు ధీటుగా రాబట్టడం ఈ ఇద్దరికే సాధ్యం అనుకుంట.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.