Rajamouli To Declare ‘Dookudu’ As The Biggest Ever Grosser

ప్రస్తుతం టాలీవుడ్ నెం 1 డైరక్టర్ రాజమౌళి అని ఒప్పుకొవడానికి ఏ టాలీవుడ్ డైరక్టర్ కూడా వెనుకాడరు సరికదా, గర్వంగా ఒప్పుకుంటారు. అటువంటి స్థానాన్ని వరుస విజయాలతో సంపాదించారు. ఎదిగిన కొద్ది ఒదిగి వుండాలనే నియమాన్ని పాటిస్తూ తనకు నచ్చిన సినిమాలను నిర్భంగా పొగుడుతూ వుంటారు. అలా పొగిడినపుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఎదో హిరో మీద అభిమానంతో విమర్శలు చేస్తున్నారని వాటిని లైట్‌గా తీసుకున్న సందర్భాలు ఎన్నో. ఆయన ప్రతి చిన్న సరదా గాసిప్‌కు కూడా స్పందించడం గమనించిన నెం 1 గాసిప్ సైట్ ఆయనపై మరిన్నీ సరదా గాసిప్స్ క్రియేట్ చేయడం మొదలు పెట్టింది. మొన్న చిరంజీవి రాజమౌళి దగ్గరకు వెళ్ళి 150వ చిత్రం చేయమని కాళ్ళు పట్టుకున్నంత పని చేసినట్టుగా ప్రచారం చేసిన ఆ వెబ్‌సైటు, ఇప్పుడు దూకుడు సినిమాను నెం 1 గ్రాస్ కలక్షన్స్ సాధించిన చిత్రంగా రాజమౌళి డిక్లేర్ చేయనున్నారని ప్రచారం చేస్తుంది.

అలా ప్రచారం చేయడానికి కారణం లేకపోలేదు. పోకిరి రికార్డ్స్ మగధీర బీట్ చేసినపుడు ఒక మహేష్‌బాబు అభిమాని ఒక లైవ్ షోలో మగధీర రికార్డ్స్ అన్నీ ఫేక్ రికార్డ్స్ అని పూరీ జగన్నాథ్‌తో వాదులాటకు దిగాడు. అప్పుడు పూరీ జగన్నాథ్, మహేష్‌బాబు అభిమానంతో ఆ అభిమాని అలా మాట్లాడుతున్నాడు, మగధీర సినిమాను ఇండస్ట్రీ హిట్‌గా డిక్లేర్ చేసాడు. ఇప్పుడు అదే రితీలో మగధీర డైరక్టర్ రాజమౌళి, ’దూకుడు’ సినిమాను ఇండస్ట్రీ హిట్ అని డిక్లేర్ చేసే విధంగా ఎవరో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా గాసిప్స్ నిలయంగా పేరొందిన గ్రేట్‌ఆంధ్ర.కామ్ వారు ప్రచురించారు. ఆ గాసిప్ లింకుకు సమాధానంగా రాజమౌళి ఈ క్రింది విధంగా స్పందించారు.

GreatAndhra.com
Rajamouli To Declare ‘Dookudu’ As The Biggest Ever Grosser

ssrajamouli rajamouli ss
I am gonna declare?????beats me

రాజమౌళిపై ఆ సైటు అలా గాసిప్స్ క్రియేట్ చేయడానికి కారణం ఎవరో ఒకాయన బాగా చెప్పారు.

TheOnlyBrahma Brahma mahesh
@ssrajamouli When the name Rajamouli has become a brand, ppl wud like to create controversy by linking tht to anything n evrything.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.