కేరళలో రచ్చ రేపుతున్న మల్లు అర్జున్(బన్నీ)

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాను అన్న దమ్ములైన సూర్య, కార్తిక్ లు షేక్ చేసేస్తున్నారు. అదే విధంగా నేను చరణ్ కూడా చేసే రోజు రావాలని ఆశీస్తున్నాను. – అల్లు అర్జున్

ఏ తమిళ్ సినిమా తీసుకున్నా డబ్బింగ్ అవుతూ తెలుగులో మంచి మార్కెట్ వుంది. తమిళ్ హిరోలకు కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఓపినింగ్స్ కూడా బాగానే రాబడుతున్నారు. అదే విధమైన మార్కెట్ మన తెలుగు హిరోలకు తమిళ్‌లో లేదు.

కన్నడంలో వేరే బాష సినిమాలు డబ్బింగ్ చేయనివ్వరు, కాని డైరక్ట్ తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ వుంది. హిరోలకు కూడా మంచి క్రేజ్ వుంది.

కేరళలో ఒకే ఒక్క తెలుగు హిరోకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ ఒక్కడే అల్లు అర్జున్. వాళ్ళు మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. ఎంత క్రేజ్ అంటే డాన్స్ ప్రొగ్రామ్స్ కాంపీటేషన్‌కు మన బన్నీ పోస్టర్స్‌తో ప్లేక్సీలతో పబ్లిసిటీ చేస్తున్నారు. ఇదే రకమైన గ్రిప్ తమిళ్‌లో కూడా సాధిస్తే, బన్నీ సౌత్ ఇండియా సినిమాను షేక్ చేసే రోజు తప్పకుండా వస్తుందనడంలో సందేహం లేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.