పవన్ కళ్యాణ్ ‘పంజా’ ఎటువంటి సినిమా ?

సినిమా పబ్లిసిటీ లక్ష్యాలు రెండు.

1) ఈ సినిమా రాబోతుంది అని తెలియ చెప్పడం
2) ఈ రకమైన సినిమాకు ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం

మొదటి లక్ష్యంలో భాగంగా:
మా సినిమా త్వరలో రోబోతుందని ‘పంజా’ నిర్మాతలు పబ్లిసిటీ బాగా చేస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేలా చేయగల్గారు.

రెండో లక్ష్యం:
మా సినిమాలో ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే అంశాలు ఇలా వుండబోతున్నాయి అని ఇంకా చెప్పలేదు.

మాములుగా సినిమా అనేది వ్యాపారం కాబట్టి, పబ్లిసిటీలో రెండో లక్ష్యాన్ని నిర్మాతలు నిజాయితీగా చెప్పడం చాలా రేర్ గా జరుగుతూ వుంటుంది. ఏ మాత్రం తేడా జరిగినా ఓపినింగ్స్ కు పెద్ద బొక్క పడిపోతాది. చాలా కేర్ ఫుల్ గా ప్లాన్ చెయ్యాలి.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టైటిల్ & స్టిల్స్ ను బట్టి చూస్తే సినిమా ఎలా వుంటుందో అసలు ఐడియా రావడం లేదు. పాటలు, ట్రైలర్స్ రిలీజ్ అయ్యాక అయినా వస్తుందనేది కూడా డౌటే . కనీసం రెండు రోజులు ముందు అయినా “ఈ సినిమా(సబ్జక్ట్ పరంగా)పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడానికి కారణం ఏమిటి?” అనే ప్రశ్నకు సమాధానం చెపితే, సినిమా చూసే ముందు ఒక అంచనాకు రావచ్చు. అలా చెప్పడం వలన పోస్టర్స్, ట్రైలర్స్, టైటిల్, పాటలు అన్నీ చూసి ఏవేవో ఊహించుకొని, వారు ఊహించుకున్న విధంగా సినిమా లేకపోవడం చూసి నిరుత్సాహ పడటం వుండదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.