శ్రీరామరాజ్యం – ప్రతి తెలుగువాడు గర్వించవలసిన సినిమా

బాలకృష్ణ రాముడుగా, నయనతార సీతగా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీరామరాజ్యం. యలమంచి సాయిబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీరామరాజ్యం చిత్రంపై mythological & devotional ఫిలిమ్స్ ఇష్టపడే వాళ్లకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో మహానటుడు డా.అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి పాత్రపోషించడం విశేషం. లక్ష్మణుడుగా శ్రీకాంత్, భరతుడుగా సాయికుమార్ నటించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన శ్రీరామరాజ్యం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. బాలకృష్ణ, బాపుల కలయికలో రూపొందిన శ్రీరామరాజ్యం చిత్రాన్ని నవంబర్ 10న రిలీజ్ చేయలనుకున్నారు, కాని పోస్ట్ ప్రొడక్షన్ డిలే వలన ఆ డేట్ కు చేయలేకపోతున్నారు. రిలీజ్ డేట్ తెలియవలసి వుంది.

ఇప్పుడు దాకా పాటలు వినని అల్లుశిరీష్, ఇప్పుడే పాటలు విన్నానని, అవి బాగా నచ్చాయని, సినిమా కోసం ఎదురుచుస్తున్నట్టుగా ట్వీట్ చేసారు. శ్రీరామరాజ్యం లాంటి mythological & devotional ఫిలిమ్స్ ఒక్క తెలుగులోనే నిర్మిస్తున్నారని, ప్రతి తెలుగువాడు గర్వించ వలసింది అని కూడా అన్నారు.

శ్రీరామరాజ్యం ప్రతి తెలుగువాడు గర్వించవలసిన సినిమా – అల్లు శిరీష్

SirishAllu Sirish Allu
We should be proud that Telugu Cinema is the only industry that still produces mythological & devotional films which are big draws @ BO too.

SirishAllu Sirish Allu
The soundtrack of Sri Rama Rajyam is pure bliss! How could I miss it all these days? Waiting for the film.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.