చెప్పడం ఈజీ .. చేయడం కష్టం ..

ఇంటర్వ్యూ మొత్తం వచ్చాక, ట్వీటర్ పై పవన్ కల్యాణ్ అభిప్రాయం ఏమిటనేది అర్దం అయ్యింది. he was not commenting anyone. he is questioning himself.

నా అభిప్రాయం ఇది .. నేను దీనిని సపోర్ట్ చేస్తున్నాను .. నేను దానిని సపోర్ట్ చేస్తున్నాను .. అని చెప్పడం ఈజీ .. అది నాకిష్టం లేదు .. ఉదాహరణకు: నేను అన్నా హజారేకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పడం వలన ఉపయోగం ఏమిటి? నేను వెళ్ళి ఆయనతో పాటు కూర్చుంటే అది అసలయిన పద్దతి. చేతనయితే అలా చెయ్యాలి. లేకపొతే మౌనంగా వుండాలి. కేవలం అభిప్రాయాలు చెప్పడం వలన ఏమీ ఉపయోగం లేదు. – Pawan Kalyan

పంజాపై నా అభిప్రాయం చెప్పడం వలన ఉపయోగం ఏమిటి? నా అభిప్రాయం ఎవరికి అవసరం? అనే ప్రశ్నలు ఉదయించాయి.

ఇది బాగోలేదు .. అది బాగోలేదు .. ఇది నచ్చలేదు .. అది నచ్చలేదు .. ఇది అలా వుంటే బాగుండేది .. అది ఇలా వుంటే బాగుండేది .. అని పేరాలు పేరాలు వ్రాయడం వలన ఉపయోగం ఏమిటి అంటే నా దగ్గర సమాధానం లేదు.

ఏదైనా నా అంతట నేను తెలుసుకొవాలే తప్ప నాకు ఒకరు చెపితే నాకు అర్దం కాదు.

ఈ వెబ్ సైటు ద్వారా రెండు లక్ష్యాలు:
1) నేను ఎక్సపర్ట్ వెబ్ డెవలపర్ అవ్వాలని
2) not just mega movies, నేను చూసిన ప్రతి సినిమాపై నా స్పందన, అభిప్రాయం ఏమిటనేది చెప్పాలని

పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ చూసాక, నా రెండో లక్ష్యం చాలా ఎబ్బెట్టుగా వుంది.

మనిషికి ఇంధనం ఉత్సాహం. బ్రతకడానికి కావలిసిన ఉత్సాహాన్ని మన అవసరాలే కలిపిస్తాయి. అవసరానికి మించి కొరికలు, లక్ష్యాలు, ఆశలు మనిషి సామర్ద్యానికి మించి వున్నప్పుడు ప్రొత్సాహం లేదని పరనిందలు చేస్తూ కాలం గడిపేస్తూ వుంటారు.

మనిషి సాధించలేని లక్ష్యం ఏదీ లేదు. లక్ష్యం సాధించడానికి చేయవలసింది ప్రొత్సాహం లేదని పరనిందలు చేయడం కాదు, లక్ష్యం సాధించడానికి కావలసింది, తనకు కావలసిన ఉత్సాహాన్ని తానే ఉత్పత్తి చేసుకోగలిగే సామర్ద్యం. పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ ద్వారా నాకు అర్దం అయ్యిందేమిటంటే: Pawan Kalyan has that capability.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.