రాజన్న, F/Oమల్లమ్మ – మై టాక్

మొత్తానికి రాజన్న కూడా చూడకుండా వుండలేకపోయాను.
తప్పకుండా చూడాలి అని చెప్పలేను, కాని తెలుగులో కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నందుకు ఒకసారి చూడవచ్చు అంటాను.
తీయడానికి చాలా క్లిష్టమైన కథ.
రాజన్న F/Oమల్లమ్మ అనో, మల్లమ్మ అని మల్లమ్మ కథలా తీసివుంటే నాకు నచ్చేది. మల్లమ్మ నచ్చింది, రాజన్నను భరించడం కష్టంగా అనిపించింది.
సెంటిమెంట్ బాగుంది. వయలెన్స్ ఎక్కువైంది.
గ్రేట్ ఫిలిం అనిపించ లేదు కాని, మంచి ప్రయత్నం అనిపించింది.
ఈ సినిమాకు రియల్ హిరో యం.యం.కీరవాణి. మ్యూజిక్ & పాటలే ఈ సినిమాకు ఆయువు పట్టు.
పబ్లిసిటిలో చెప్పిన విధంగా రాజన్న ఆయుధం పాట మాత్రమే అన్నది అబద్ధం. కత్తి కూడా. కత్తి పట్టినపుడు నాకు నచ్చలేదు.
మల్లమ్మ నచ్చింది, రాజన్నను భరించడం కష్టంగా అనిపించింది. కాని రాజన్న లేకపోతే మల్లమ్మ లేదు.
సెట్టింగ్స్ అతికి పెట్టినట్టు వున్నాయి.
కమర్షియల్ గా ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఎక్కువ రాబట్టే ప్రయత్నం బాగుంది.
incomplete మూవీలా అనిపించింది. something is missing.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.