రెడ్డిగారు పోయారు

రాంగోపాలవర్మను ఫాలో అవ్వాలంటే భయం. ఆయన మెసేజ్ స్ అర్ధం కాక నాకు ఎక్కడ మెంటల్ వచ్చేస్తుందేమోనని. కాని, నాకు ఎవరి మీదనైన కోపం వచ్చినప్పుడు ఆయన మెసేజ్ స్ చదువుతా. కోపం పోయి, మంచి రిలీఫ్ గా వుంటుంది. అయన గురుంచి టాపిక్ ఏదైనా వస్తే, ఆయనను కామెంట్ చేయడం కష్టం. సిట్యుయేషన్ ను బట్టి ఆయనను ఈ క్రింది విధంగా పొగడవలసి/తిట్టవలసి వస్తుంది.

1) రాంగోపాలవర్మ? పెద్ద పరమ జీనియస్
2) రాంగోపాలవర్మ? పెద్ద మెంటల్ నా Mగాడు
3) రాంగోపాలవర్మ? దమ్మున్న మగాడు

మనిషి తన చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని, ఆ సర్కిల్ లో తన సొంత రూల్స్ ఫార్మ్ చేసుకొని, తాను చేసేవన్నీ ఒప్పులు అనే అనుకుంటాడు. నేను దానికి ఆతీతం కాదు. నేను తప్పు అనుకున్నది మీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు. నేను ఒప్పు అనుకున్నది మీ దృష్టిలో తప్పు కావచ్చు. తప్పయినా, ఒప్పయినా ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.

తప్పు చేస్తున్నాని చెప్పి మరీ ధైర్యంగా తప్పు చేయడం, కొందరి దృష్టిలో ఒప్పు మాత్రమే కాదు, రియల్ హీరోయిజం. తప్పు తప్పే , తప్పు చేయవద్దని నీతులు చెప్పడం చేతకానితనం.

ఒక కులంను అగౌరవపరుస్తూ సినిమా టైటిల్ పెట్టడం చాలా పెద్ద తప్పు. రాంగోపాలవర్మ దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు.

తప్పు ఒప్పులు పక్కన పెడదాం. ఆ టైటిల్ తప్పు అని టి.వి లలో రాంగోపాలవర్మను బెదరించడం ఏమిటి? దరిద్రంగా మాట్లాడితే టి.విలో చూపిస్తారని పబ్లిసిటి కోసం టి.విలు ఎక్కి, రాంగోపాలవర్మకు పబ్లిసిటి అని విమర్శించడం ఏమిటి? నిజంగా కులం కోసం రాంగోపాలవర్మను చంపి, జైల్లో జీవితం గడపాలనుకునే వాళ్ళు వుంటారా?

నాకు ఎమోషన్స్ వుండవని చెప్పే రాంగోపాలవర్మ, తన లానే ఎవరికీ ఎమోషన్స్ వుండకూడదు అని, అందరి ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాడు. రాంగోపాలవర్మకు సినిమా ద్వారా నిజాలు చెప్పేంత దమ్ము లేదు. సినిమాల ద్వారా ఎవరినో ఉద్దరించాలన్న ఆలోచన అసలు లేదు. జనాల రియాక్షన్స్ ఎలా వుంటాయనే ఇంటరెస్ట్ మాత్రం పుష్కలంగా వుంది. do not fall into his trap. My guess, చివరికి ఈ టైటిల్ ను సమర్ధించే(రెడ్డులను ద్వేషించే వాళ్ళు) వాళ్ళకే తిరిగి పెద్ద ఎసరు పెడతాడు.

bottomline:
రాంగోపాలవర్మను అర్ధం చేసుకోలేక, కొమ్ములు తిరిగిన మీడియానే లైటు తీసుకుంటుంది. ఇక మనమెంత?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, సినిమా, Xclusive. Bookmark the permalink.