సీరియస్ గా రచ్చ ఆడియో ఫంక్షన్

ఆడియో సాంగ్స్ ముందే వినేయడం వలన ఆడియో సాంగ్స్ గురుంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. టైటిల్ సాంగ్ తప్ప, మిగతా సాంగ్స్ అన్నీ కూడా సినిమా వచ్చాక హిట్ అవ్వాల్సిన సాంగ్సే.

రామ్ చరణ్ సీరియస్ గా వుండటం వలనేమో ఫంక్షన్ అంతా సీరియస్ గా వున్నట్టు అనిపించింది.

ముందుగా ఒకటి చెప్పాలి. మెగా ప్రత్యర్ది హిరో ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు, మెగా రిఫరెన్స్ వస్తే మెగా అభిమానులు ఎంతో సంతోషిస్తారు. కావాలని ఇగ్నోర్ చేస్తే దుమ్మెత్తి పోస్తారు. మార్పు రావాలనుకుంటే ముందు మనం మారి మార్పు కోరుకుంటే అర్ధం వుంది. ప్రతివోడు మార్పు మార్పు అంటాడు తప్ప, తను మాత్రం మారాలనుకోడు. తమన్నా బెస్ట్ పెరఫార్మన్స్ అంటే ఊసరవల్లి. తమన్నా గురుంచి చెపుతూ ‘ఊసరవెల్లి’ ఇగ్నోర్ చేయడం దరిద్రంగా వుంది. మెగా అభిమానులకు వేరే వాళ్ళను విమర్శించే అర్హత కోల్పోయేలా ఈ సినిమా మేకర్స్ చేసారు.

ఒక పక్క రామ్ చరణ్ కు కాలు బెణికిందని అందోళన, మరో పక్క సినిమా అనుకున్న టైంకు రాకుండా మరో రెండు పెద్ద సినిమాలు ‘ఈగ’ ‘దమ్ము’ ల టైంలోనే వస్తుందన్న భయం మెగా అభిమానులలో వుంది.. రామ్ చరణ్ తన బాద బయటకు కనపడ కుండా, ఎంత కష్టమైనా సినిమా డిలే వుండదని రామ్ చరణ్ మెగా అభిమానులకు భరోసా ఇవ్వడం బాగుంది.

పరిక్షల సమయం, రాయలసీమ విద్యార్దులు డిస్టర్బ్ అవుతారని కర్నూల్ లో ఆడియో ఫంక్షన్ రామ్ చరణ్ అక్కడ చేయకూడదు అనుకోవడం బాగుంది.

అభిమానుల ప్రార్దనలే మాకు శ్రీరామ రక్ష అని చిరంజీవి చెప్పడం బాగుంది.

పవన్ కళ్యాణ్ పేరు వినగానే అభిమానుల హడావుడి చూసి, పవన్ కళ్యాణ్ వచ్చారనుకున్నాని రాజమౌలి జోక్ చేయడం బాగుంది. ‘శంకర్ దాదా’ డాక్టర్ గెటప్ లో చిరంజీవిని మించి చరణ్ వున్నాడనటం కరెక్ట్ అనిపించింది.

మన తెలుగు మీడియా, లేని మెగా కలహాలు సృష్టింస్తుందోనని, వాటిని ఎక్కడ మెగా అభిమానులు సీరియస్ గా తీసుకుంటారనే భయంతో పవన్ కళ్యాన్ రాక పోవడానికి కారణాలు చెప్పడం బాగుంది. ఎవరు మాట్లాడుతున్నా ‘పవన్ కళ్యాణ్’ ‘పవన్ కళ్యాణ్’ అని అభిమానులు అరవడం అతి అనిపించింది. ఎవరు మాట్లాడుతున్నా ‘పవన్ కళ్యాణ్’ ‘పవన్ కళ్యాణ్’ అని అభిమానులు అరవడం అతి అనిపించింది.

Finally, ట్రైలర్స్ చూస్తుంటే చిరంజీవిని చూస్తున్న ఫీలింగే వచ్చింది. వాన సాంగ్ ఈ తరం మెగా అభిమానులకు నచ్చుతుందేమో కాని , కోర్ చిరంజీవి అభిమానులకు నచ్చదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.