ఆరెంజ్ బాటలో రచ్చకు కూడా భారీ నష్టం

సినిమా ఎందుకు తీస్తున్నాం అనే అవగాహన లేకుండా సినిమాకు వచ్చే కలక్షన్స్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టేసి సినిమా తీయడం ఒక పెద్ద తప్పు. నిర్మాణంలో జరిగిన తప్పులు తర్వాత సినిమా నిర్మాణంలో జరగకుండా చూసుకోవాలి తప్ప, జరిగి పోయిన దానికి చేయ గల్గింది ఏమీ లేదు.

అందరూ ఏకగ్రీవంగా బాగుందనే అనే సినిమాలు చాలా చాలా అరుదుగా వస్తాయి. ఆరెంజ్ సినిమా అందరికీ నచ్చక పోయినా కొందరికి మాత్రం బాగా నచ్చింది. పబ్లిసిటీతో ఆ కొందరికి మరికొందరిని జత చేయవలసిన బాద్యత నిర్మాతకు వుంది. సినిమా పబ్లిసిటీ చేయవలసిన సమయంలో , పబ్లిసిటీ మాట దేవుడెరుగు ఆరెంజ్ సినిమా నచ్చిన కొంత మంది కూడా బాగుందనే చెప్పుకోలేని దుస్థితిని తన లూజ్ టంగ్ తో ఆరెంజ్ నిర్మాత నాగేంద్రబాబు కలిపించాడు. ఆ దెబ్బతో ఆరెంజ్ సినిమా రేంజ్ ఇంకా పడిపోయింది.

ఇప్పుడు రచ్చ సినిమా నిర్మాతలు కూడా నాగేంద్రబాబునే ఫాలో అవుతున్నట్టు వున్నారు. రచ్చ సినిమా కూడా ఓవర్ బడ్జెట్ సినిమాలానే కనిపిస్తుంది , సినిమా రిలీజ్ పై మాత్రం పెదవి విప్పడం లేదు. సినిమా రిలీజ్ డిలే చేస్తే ‘రచ్చ’ కలక్షన్స్ గండి కొట్టడానికి మరో రెండు భారీ సినిమాలు రాజమౌళి ‘ఈగ’ ఎం.టి.ఆర్’దమ్ము’ లతో పాటు, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ కూడా లైనులో వుంది.

రచ్చ ఆడియో అభిమానులు ఎవరేజ్ అంటున్నా, రచ్చ టైటిల్ సాంగ్ మాత్రం అభిమానులకు బాగా నచ్చింది. అన్నీ పాటలు ఇప్పటికే మాస్ ను మాత్రం బాగా అలరిస్తున్నాయి. సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పకుండా ఒక పక్క అభిమానులని నిరుత్సాహ పరుస్తూ, మరో పక్క పబ్లిసిటిని కూడా నిర్లక్ష్యం చేస్తే ఆరెంజ్ బాటలో రచ్చకు కూడా భారీ నష్టం తప్పదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.